తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త : ఎన్నికల కోసం 1,043 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

By Arun Kumar PFirst Published Sep 21, 2018, 4:07 PM IST
Highlights

తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నిర్వహణకు అవసరమైన పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించడానికి 1,043 ఉద్యోగులను నియమించుకోడానికి అనుమతిచ్చింది. ఇందుకోసం ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీఅయ్యాయి.

ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ జారీ చేశారు. రాష్ట్రంలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన 352 పోస్టులు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో 691 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో కేవలం సీఈవో కార్యాలయానికి 21 తాత్కాలిక , 60 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ శాఖలో అనేక ఉద్యోగాల కోసం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 9వేల పైచిలుకు పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలకోసం నోటిపికేషన్ వేలువడి పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా వీఆర్వో ఉద్యోగాల కోసం ఇటీవలే అభ్యర్థులకు పరీక్షలు ముగిసాయి. ఇక పోలీస్ శాఖలో ఇప్పటికే భారీగా నియామకాలు జరగ్గా మరిన్ని చేపట్టడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల జాతర మొదలవగా మరోసారి ఎన్నికల విధుల కోసం ఉద్యోగాల భర్తీ చేపట్టడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

click me!