
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్, అతని కుమార్తె సాహితీలను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పోల రమేష్ సహకారంతో సాహితి మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లుగా సమాచారం . కూతురు పరీక్ష కోసం పోల రమేష్ నుంచి శ్రీనివాస్ ఏఈఈ పరీక్ష పత్రాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. రమేశ్‌కు శ్రీనివాస్ డబ్బులు కూడా చెల్లించినట్లే తేలింది. తాజా అరెస్ట్‌లతో కలిపి పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 80కి చేరుకుంది.
Also Read: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం: మరో ముగ్గురు అరెస్ట్
ఇకపోతే.. పేపర్ లీక్ కేసులో మంగళవారం సిట్ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విద్యుత్ శాఖలో డీఈగా పనిచేసిన రమేష్ నుండి వీరు ఏఈఈ పరీక్ష పేపర్ ను తీసుకున్నట్టుగా సిట్ గుర్తించింది. పరీక్ష రాసి ఉద్యోగం వచ్చిన తర్వాతే డబ్బులు ఇవ్వాలని రమేష్ వీరితో ఒప్పందం చేసుకున్నాడు. సుమారు 30 మందికి రమేష్ ఏఈఈ పరీక్ష పేపర్ ను ఇచ్చినట్టుగా సిట్ గుర్తించింది.