అవినీతి నిరోధ‌క శాఖ డీజీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అంజ‌నీకుమార్

Published : Dec 25, 2021, 05:40 PM IST
అవినీతి నిరోధ‌క శాఖ డీజీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అంజ‌నీకుమార్

సారాంశం

అవినీతి నిరోదక శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా అంజ‌నీకుమార్ ఐపీఎస్ శ‌నివారం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయన అంతకు ముందు హైదరాబాద్ కమిషనర్ గా పని చేశారు. గోవింగ్‌ సింగ్ నుంచి ఈరోజు ఆయ‌న బాధ్య‌తలు స్వీక‌రించారు. 

అవినీతి నిరోధక శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గా అంజ‌నీకుమార్ ఐపీఎస్ శ‌నివారం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ఉన్న గోవింగ్‌ సింగ్ నుంచి ఆయ‌న బాధ్య‌తలు స్వీక‌రించారు. బాధ్య‌తలు స్వీక‌రించిన అనంత‌రం అంజ‌నీకుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించ‌డానికి త‌న వంతు కృషి చేస్తాన‌ని అన్నారు. ఈ అవ‌కాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అవినీతి నిరోధ‌క శాఖ‌లో ప‌ని చేసే అంద‌రూ ఆఫీస‌ర్లు నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేయాల‌ని కోరారు. ఇంత వ‌ర‌కు హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌కు మూడేళ్ల పాటు క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేశాన‌ని అన్నారు. ఆ బాధ్య‌తలు సంతృప్తినిచ్చాయ‌ని తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో ఆ విధులు విజ‌య‌వంతంగా నిర్వర్తించాన‌ని అన్నారు. త‌న‌కు అంద‌రి నుంచి పూర్తి స‌హ‌కారం ల‌భించింద‌ని అన్నారు. త‌న‌తో పాటు ప‌ని చేసిన అంద‌రికీ కృతజ్ఞ‌త‌లు చెప్పారు. త‌న ప‌ని చేసిన కాలంలో అన్ని ర‌కాల ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని అన్నారు. మంచి ప్ర‌ణాళిక ప్ర‌కారం ఎన్నిక‌ల‌కు బందోబ‌స్తు ఏర్పాటు చేశామ‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎన్నో స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని తెలిపారు. త‌న‌పై న‌మ్మ‌కంతో ఈ బాధ్య‌త అప్ప‌గించార‌ని, దీనిని నిల‌బెట్టుకుంటాన‌ని తెలిపారు. 

పవన్ కల్యాణ్ పోస్టు మతమార్పిడిలకు ఎంకరేజ్మెంట్‌లా ఉంది..మాధవీలత సంచలన కామెంట్స్

భారీగా ఐపీఎస్ ల బ‌దిలీలు..
తెలంగాణ ప్ర‌భుత్వం శుక్ర‌వారం భారీగా ఐపీఎస్‌ల బ‌దిలీలు చేప‌ట్టింది.  30 మంది ఐపీఎస్‌ అధికారులను ట్రాన్స్‌ప‌ర్స్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా నియమించారు. ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌ సీపీగా వ‌చ్చారు. ఏసీబీ డైరెక్టర్‌గా షిఖా గోయల్‌, హైదరాబాద్‌ సంయుక్త సీపీగా ఏఆర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా ఏవీ రంగనాథ్‌, నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరి, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా ఎన్‌.శ్వేత, హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీగా జోయల్‌ డెవిస్‌, హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా కార్తికేయ, మెదక్‌ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్‌ క్రైం డీసీపీగా కమలేశ్వర్, సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా అవినాష్‌ మొహంతి, హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్‌ డీసీపీగా గజరావు భూపాల్‌, హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌గా పి. విశ్వప్రసాద్‌, మహబూబాబాద్‌ ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఎన్‌.ప్రకాశ్‌రెడ్డిని బదిలీ చేశారు. 

చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తి ర‌ద్దు చేయాలి.. చేనేత, ప‌ద్మ‌శాలీ సంఘాల మహాధర్నా

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్