ప్రేమోన్మాది దాడి: 14 చోట్ల దిగిన కత్తి, ఆగని రక్తస్రావం

By Siva KodatiFirst Published Feb 7, 2019, 12:07 PM IST
Highlights

మధులికపై దాడి చేసిన నిందితుడిని మూసీ నది సమీపంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. బాలికపై దాడి ఘటనపై దర్యాప్తు వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. మధులికను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని అతని ఇంటి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు

మధులికపై దాడి చేసిన నిందితుడిని మూసీ నది సమీపంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. బాలికపై దాడి ఘటనపై దర్యాప్తు వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. మధులికను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని అతని ఇంటి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మధులిక కోలుకున్న తర్వాత ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించి తదుపరి విచారణను చేపడతామని తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధులిక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

బీపీ లెవల్స్ పడిపోయాయని, శ్వాస కూడా తీసుకోలేని పరిస్ధితుల్లో ఉన్న ఆమెను అత్యవసర చికిత్సా విభాగానికి తరలించిన వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపారు. మధులిక శరీరంపై 14 చోట్ల బలమైన కత్తిగాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

కత్తి వేటుకు పుర్రె రెండుగా చిలీపోయిందని, కీలక నరాలు తెగిపోయాయని అంతర్గత రక్తస్రావం ఎక్కువగా అవుతోందని తెలిపారు. మరికాసేపట్లో ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. 

మధులికపై ప్రేమోన్మాది దాడి: రెండు రోజుల ముందు కత్తి దొంగిలించి...

మధులికపై దాడి చేసిన భరత్ అరెస్ట్

మధులిక పరిస్థితి విషమం: 72 గంటలు అబ్జర్వేషన్

హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి

click me!