వ్యాపారిని కిడ్నాప్ చేసి కొట్టుకొంటూ నగరమంతా తిప్పారు

Published : Feb 07, 2019, 11:00 AM IST
వ్యాపారిని కిడ్నాప్ చేసి కొట్టుకొంటూ నగరమంతా తిప్పారు

సారాంశం

 హైద్రాబాద్‌లోని చందానగర్‌లో బంగారం వ్యాపారి  లక్ష్మణ్‌‌ను ముగ్గురు నిందితులు పోలీసులంటూ కిడ్నాప్ చేసి రాత్రంతా వాహనాల్లో తిప్పుతూ దాడికి పాల్పడ్డారు. 


హైదరాబాద్: హైద్రాబాద్‌లోని చందానగర్‌లో బంగారం వ్యాపారి  లక్ష్మణ్‌‌ను ముగ్గురు నిందితులు పోలీసులంటూ కిడ్నాప్ చేసి రాత్రంతా వాహనాల్లో తిప్పుతూ దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు  పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

చందానగర్‌‌లో బంగారం వ్యాపారి లక్ష్మణ్‌ను బుధవారం రాత్రి ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పోలీసులమని చెప్పి ఓ వాహనంలో రాత్రంతా సిటీ తిప్పుతూ లక్ష్మణ్‌పై దాడికి పాల్పడ్డారు. బాకీ చెల్లించలేదనే నెపంతోనే దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి.

గురువారం తెల్లవారుజామున బాధితుడిని చార్మినార్ వద్ద వదిలివెళ్లాడు.  అయితే ఈ దాడికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. లక్ష్మణ్‌ను మహేష్ అగర్వాల్ అనే వ్యాపారి కిడ్నాప్ చేయించినట్టుగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్