ముందస్తు ఎన్నికల ఎఫెక్ట్ : ఆమ్రపాలికి నూతన బాధ్యతలు

By Arun Kumar PFirst Published Sep 21, 2018, 4:53 PM IST
Highlights

అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్దమయ్యాయి. నాయకులంతా నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నాలు, ప్రచారాలు ప్రారంభించారు. అయితే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కూడా కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం మరో ఐపిఎస్ అధికారికి ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
 
ప్రస్తుతం జీహెచ్ఎంసీ అడిషినల్ కమీషనర్ గా వున్న ఆమ్రపాలి రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా నియమితులయ్యారు. ఈమె నియాకానికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసింది. ఆమ్రపాలిని ముఖ్యమైన  ఐటీ సంబంధిత అంశాలను పర్యవేక్షణ కోసం  జాయింట్ సీఈవోగా నియమించినట్లు సమాచారం.  

ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి గతంలో వరంగల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే ఆమె బాగా ఫేమస్ అయ్యారు.కొండలపై ట్రెకింగ్ చేయడం, మరో కలెక్టర్ తో కలిసి అడవిలో పర్యటించడం వంటి సాహసోపేత కార్యక్రమాలు చేపట్టారు. ఇలా వినూత్నంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే గత వినాయక చవితి సందర్భంగా వినాయకుడితో పాటు ఆమె విగ్రహాన్ని కూడా కొందరు అభిమానులు ప్రతిష్టించారు. ఇలా ఏ కలెక్టర్ కు లేని పబ్లిసిటీని ఆమ్రపాలి సంపాధించారు.

ఇక ఎన్నికల విషయానికి వస్తే.... తొందర్లోనే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రస్తుతమున్న అధికారులపై పనిభారం పెరిగింది. ఓటర్ల నమోదు, ఎన్నికల  నిర్వహణకు ఏర్పాట్లు తదితర పనులను పర్యవేక్షణలో అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇప్పటికే  జ్యోతి బుద్ధ ప్రకాష్ ను ఎన్నికల అదనపు అధికారిగానియమించగా తాజాగా ఆమ్రపాలిని జాయింట్ సీఈఓగా నియమిస్తూ సీఈసి నిర్ణయం తీసుకుంది.
 
click me!