కాంగ్రెస్, బీజేపీ కలిసి నన్ను ఓడించాయి.. నైతిక విజయం టీఆర్ఎస్‌దే: హుజురాబాద్ ఓటమిపై గెల్లు శ్రీనివాస్ స్పందన

Siva Kodati |  
Published : Nov 02, 2021, 08:06 PM IST
కాంగ్రెస్, బీజేపీ కలిసి నన్ను ఓడించాయి.. నైతిక విజయం టీఆర్ఎస్‌దే: హుజురాబాద్ ఓటమిపై గెల్లు శ్రీనివాస్ స్పందన

సారాంశం

హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌దే నైతిక విజయమన్నారు ఆ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ (gellu srinivas yadav). కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు  నన్ను ఓడించాయని శ్రీనివాస్ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా హుజురాబాద్ లో  గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌దే నైతిక విజయమన్నారు ఆ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ (gellu srinivas yadav). కౌంటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థి నాయకుడిగా నాకు హుజురాబాద్ లో అవకాశం కల్పించారని తెలిపారు. నా గెలుపు  కోసం కష్టపడ్డ మంత్రులకు, ఇతర నేతలకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేనే నెరవేరుస్తానని.. కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు  నన్ను ఓడించాయని శ్రీనివాస్ ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా హుజురాబాద్ లో  గులాబీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నానని.. ఉపఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్‌కు శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. 

అంతకుముందు హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల (huzurabad bypoll) ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తామన్నారు టీఆర్ఎస్ (trs) నేత, మంత్రి హరీశ్ రావు (harish rao).  ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ ఆయన పేరుపేరున క్ర‌త‌జ్ఙ‌త‌లు తెలిపారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌కు హరీశ్ రావ్ ధన్య‌వాదాలు తెలిపారు.  టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ త‌గ్గ‌లేదని..  అయితే, దేశంలో ఎక్క‌డా లేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ (congress), బీజేపీలు (bjp)క‌లిసి ప‌నిచేశాయని హరీశ్ ఆరోపించారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కూడా చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మ‌క్కు కావ‌డాన్ని రాష్ట్ర ప్ర‌జలంతా గ‌మ‌నిస్తున్నారని హరీశ్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు.. గెలిచిన‌నాడు పొంగిపోలేదని, ఓడినా.. గెలిచినా టీఆర్ఎస్ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. 

Also Read:Huzurabad Bypoll Result: నిలబడ్డాడు.. కలబడ్డాడు.. ఈటల గెలుపు వెనుక..!

హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) కూడా స్పందించారు. హుజురాబాద్‌లో పార్టీ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు, ప్రశంసలు తెలిపారు. టీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అలుపెరగకుండా పోరాటం చేశారని.. వారికి ధన్యవాదాలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గత 20 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ఎన్నో ఎత్తు పల్లాలను చూసిందన్న కేటీఆర్.. ఈ ఒక్క ఎన్నిక(హుజురాబాద్) ఫలితం అంతా ఇంపార్టెంట్ కాదన్నారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు భవిష్యత్ పోరాటల్లో మరింత దృఢ సంకల్పంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా.. మొన్న ముగిసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.....ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన  పోలింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు..ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించారు..నియోజకవర్గం లో  144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కన్నల్ ఇప్పటికే తెలిపాడు..ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగించారు... మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగించారు..306 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు..!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు