విమోచన దినోత్సవం .. కేసీఆర్ ఎవరికో భయపడుతున్నారు, మజ్లిస్‌కు బీజేపీ భయపడదు : అమిత్ షా

By Siva KodatiFirst Published Sep 17, 2021, 4:25 PM IST
Highlights

బీజేపీ  అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీకి బీజేపీ భయపడదని.. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని .. తెలంగాణ సమస్యలు తెలుసుకునేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని అమిత్ షా చెప్పారు.

తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,. నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. నిజాం రాక్షస పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన రోజని అమిత్ షా అన్నారు. సర్థార్ పటేల్ సైనిక చర్య వల్లే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని.. 2024లో తెలంగాణలో బీజేపీదే అధికారమని అమిత్ షా జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పట్లో కేసీఆర్ డిమాండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఆ డిమాండ్ ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీ  అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మజ్లిస్ పార్టీకి బీజేపీ భయపడదని.. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని .. తెలంగాణ సమస్యలు తెలుసుకునేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని అమిత్ షా చెప్పారు. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచామని, మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లు గెలుస్తామని అమిత్ షా స్పష్టం  చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, కాంగ్రెస్ కాదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ పగ్గాలు చేపట్లే సామర్ధ్యం బీజేపీకే వుందని అమిత్ షా అన్నారు. కారు స్టీరింగ్ ఇప్పడు ఒవైసీ చేతిలో వుందని.. అలాంటి పార్టీ వల్ల తెలంగాణకు ప్రయోజనం ఏంటని షా నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 119 స్థానాల్లో పోటీ చేస్తామని అమిత్ షా తెలిపారు. 

click me!