హైద్రాబాద్ లో 75వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల ట్రైనింగ్ పూర్తైంది. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఇవాళ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హైదరాబాద్: దేశ ప్రతిష్టతను కాపాడడంలో పోలీస్ వ్యవస్ధది కీలకపాత్ర అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారంనాడు ఉదయం 75వ బ్యాచ్ ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది.ఈ పరేడ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ట్రైనీ ఐపీఎస్ ల గౌరవ వందనాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సా గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఐపీఎస్ ట్రైనింగ్ లో టాపర్ గా నిలిచిన కాలియాకు కేంద్ర మంత్రి బహుమతి ప్రదానం చేశారు. మొత్తం 175 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు.శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 14 మందిని రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది డీఓపీటీ.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించారు.36వేల మందికి పైగా పోలీసులు దేశం కోసం తమ ప్రాణాలను బలిదానం చేశారని అమిత్ షా ప్రస్తావించారు.
undefined
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులర్పిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు.పీడిత ప్రజల అభ్యున్నతి, వారి భద్రతకు ఐపీఎస్ లు కృషి చేయాలని ఆయన కోరారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఐపీఎస్ శిక్షణ పొందిన వారిలో 33 మహిళలు ఉండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఎన్నో సంఘర్షణల తర్వాత భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.మహానుభావుల బలిదానాల ద్వారా స్వాతంత్ర్యం లభించిందని మంత్రి చెప్పారు. నేడు విశ్వ యవనికపై భారత్ తన సత్తా చాటుతుందని అమిత్ షా తెలిపారు.
Addressing the ‘Dikshant Parade’ of the 75 RR IPS probationers at SVPNPA, Hyderabad. https://t.co/1rwlWPgHiH
— Amit Shah (@AmitShah)పోలీస్ టెక్నికల్ మిషన్ ను తీసుకు వస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు..కొత్త చట్టాల అమలులో ఐపీఎస్‌లదే కీలకపాత్రగా ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం చట్టాలకు కొత్త సంస్కరణలు తెస్తున్నామన్నారు.సీఆర్పీసీ, ఐపీసీ,ఎవిడెన్స్ యాక్టులను కలిపి కొత్త క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ తెచ్చినట్టుగా ఆయన చెప్పారు.రానున్న రోజుల్లో సైబర్ నేరాలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు.