KCR: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. ఎందుకంటే..?

By Mahesh Rajamoni  |  First Published Aug 16, 2023, 11:21 PM IST

Hyderabad: ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) మెద‌క్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. తెలంగాణ వ్యాప్తంగా మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిస్తూ ఎల్లో అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 
 


KCR Medak visit: ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) మెద‌క్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. తెలంగాణ వ్యాప్తంగా మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిస్తూ ఎల్లో అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)-హైదరాబాద్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ నెల 19న మెదక్ జిల్లాలో జరగాల్సిన సీఎం కేసీఆర్ పర్యటనను 23వ తేదీకి వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ముందుగానే హైదరాబాద్ ఐఎండీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 18, 19 తేదీల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ 'ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 19న జరుప తలపెట్టిన సీఎం శ్రీ కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన 23వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.

— Telangana CMO (@TelanganaCMO)

Latest Videos

కాగా, ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్రంలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 466.9 మిల్లీమీటర్లు కాగా, సగటున 582.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేటలో అత్యధికంగా 65 శాతం పైగా వ‌ర్ష‌పాతం నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్‌లో ప్రస్తుత రుతుపవనాల సగటు వర్షపాతం 363.3 మిల్లీమీటర్లకు మించి 450.1 మిల్లీమీటర్లకు చేరుకుంది. మారేడ్‌పల్లి, చార్మినార్‌ ప్రాంతాల్లో అత్యధికంగా 49 శాతం పైగా వ‌ర్ష‌పాతం నమోదయింది.

ఈ ఏడాది ఎల్ నినో సంవత్సరం అయినప్పటికీ తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది. మ‌రోసారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఈ క్ర‌మంలోనే ఎల్లో అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

click me!