ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

Published : Sep 19, 2018, 06:21 PM ISTUpdated : Sep 19, 2018, 06:54 PM IST
ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన  అమ్మాయి తండ్రి

సారాంశం

వారం రోజుల క్రితం పెళ్లి చేసుకొన్న  నవ దంపతులు సందీప్, మాధవిపై  తండ్రి మనోహారాచారి అత్యంత దారుణంగా దాడి చేశాడు.సందీప్‌తో పాటు ఆ కుటుంబాన్ని నమ్మించి మనోహారాచారి దాడికి పాల్పడ్డాడు.

హైదరాబాద్: వారం రోజుల క్రితం పెళ్లి చేసుకొన్న  నవ దంపతులు సందీప్, మాధవిపై  తండ్రి మనోహారాచారి అత్యంత దారుణంగా దాడి చేశాడు.సందీప్‌తో పాటు ఆ కుటుంబాన్ని నమ్మించి నర్సింహ్మాచారి దాడికి పాల్పడ్డాడు.

2013 నుండి సందీప్, మాధవిలు ప్రేమించుకొంటున్నారు.  అయితే ఈ ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు. అయితే మాధవిని మేనమామకు ఇచ్చి వివాహం చేయాలని  మనోహారాచారి కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. కానీ,మాధవికి మాత్రం మేనమామను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక సందీప్ ను మాధవి పెళ్లి చేసుకొంది.

వారం రోజుల క్రితం సందీప్, మాధవిలు రిజిస్టర్ మ్యారేజీ చేసుకొన్నారు. పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంటికి రావాలని మనోహారాచారి కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చినా కూడ  మాధవి మాత్రం  తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఇష్టపడలేదు.

అయితే అబ్బాయి కుటుంబం వద్దకు  వరుసగా మనోహారాచారి వెళ్లి తన కూతురును బాగా చూసుకోవాలని  సందీప్ తో పాటు ఆ కుటుంబసభ్యులను  మనోహారాచారి కోరారు. సందీప్ కుటుంబసభ్యులు తమ కూతురు మాదిరిగానే మాధవిని చూసుకొంటున్నామని సందీప్ కుటుంబసభ్యులు  చెప్పారు. 

అయితే  ఇవాళ  కూడ తన కూతురును ఒక్కసారి చూడాలని కూడ మనోహారాచారి ఫోన్ చేశాడు. అంతేకాదు నవ దంపతులకు బట్టలు కూడ పెడతానని చెప్పాడు.ఇంట్లో ఇప్పుడే వస్తామని ఆ దంపతులు  ఎస్ఆర్ నగర్ చౌరస్తా వద్దకు చేరుకొన్నారు. 

ఎస్ఆర్ నగర్ వద్దకు మనోహారాచారి బైక్ పై వచ్చాడు. వచ్చీరాగానే  నవ దంపతులపై  దాడికి దిగాడు. కత్తితో నవ దంపతులపై దాడికి దిగాడు. వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu