అమ‌రావ‌తి పేరుతో లోకేష్, చంద్ర‌బాబులు పేదల భూములను దోచుకున్నారు : మంత్రి ఆదిమూలపు సురేష్‌

By Mahesh RajamoniFirst Published Oct 1, 2023, 12:34 PM IST
Highlights

Amaravati: రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు ప్రజలను మోసం చేసి పేదలు, దళితుల భూములను దోచుకున్నారని మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఆరోపించారు. అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో బాడా లీడ‌ర్ల ప్రమేయం ఉందని రుజువు చేసేందుకు అధికారులు అన్ని ఆధారాలు సేకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు.
 

Amaravati Inner Ring Road scam case: అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గాన్ని మార్చడం ద్వారా టీడీపీ నాయకులు చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారనీ, ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని సీఐడీ మెమోలో ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన, రింగ్ రోడ్డు, ఆర్టీరియల్ రోడ్ల అలైన్ మెంట్ విషయంలో 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారులు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో లోకేశ్ ను 14వ నిందితుడిగా చేర్చారు. సీఎం జ‌గ‌న్ స‌ర్కారు కుట్ర అంటూ టీడీపీ ఆరోపించ‌డంపై మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్పందిస్తూ.. చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న‌ కుమారుడు నారా లోకేష్‌లు ప్రజలను మోసం చేసి పేదలు, దళితుల భూములను దోచుకున్నారని పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం క్విడ్ ప్రోకో కేసు అని తెలిపారు.

అమ‌రావ‌తి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం క్విడ్ ప్రోకో కేసు తప్ప మరేమీ కాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అవి కేవలం ఆరోపణలు అని భావిస్తే ఢిల్లీలో ఉన్న‌ నారా లోకేష్ విజయవాడకు వచ్చి ఏపీ  సీఐడీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ప్రజలను మోసం చేశారనీ, పేదలు, దళితుల భూములను దోచుకున్నారని ఆరోపించారు.

Latest Videos

ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో బడాబాబుల ప్ర‌మేయం ఉంద‌నీ, దీనిని రుజువు చేసేందుకు అధికారులు అన్ని ఆధారాలు సేకరించి ఎఫ్ఐఆర్ న‌మోదుచేసిన‌ట్టు తెలిపారు. సీఆర్డీఏ చైర్మన్ గా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు అధికార గోప్యత హామీని విస్మరించి నమ్మక ద్రోహం, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని సురేష్ ఆరోపించారు. సీఆర్డీఏ అధికారులు మొదటి ఆప్షన్ సిఫారసుకు విరుద్ధంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు రెండో ఆప్షన్ ఎంచుకున్నారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వేయకపోయినా ప్రణాళికల రూపకల్పన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరపూరిత కుట్రకు, మోసానికి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.

click me!