లేక్ పోలీసులు ఏం చేశారో తెలుసా ?

First Published Jul 10, 2017, 3:47 PM IST
Highlights

పాత సినిమాల్లో చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. హీరో కుటుంబసభ్యులు విలన్స్ చేతిలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటారు. ఐస్ గడ్డల మీద నిలబడి పైన ఉరితాళ్లు భిగించబడి ఉండడం, సల సల కాగే నీటి మీద బంధించి ఉంచడం లాంటి సీన్లు చాలా చూశాం. అయితే కష్టాల్లో ఉన్న వారిని రక్షించలంటూ పోలీసులకు ఫోన్ అందుతుంది. కానీ వాళ్లు వచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అంతకుముందే హీరో వచ్చి రౌడీలను చితకబాది తన కుటుంబసభ్యులను కాపాడతాడు. పోలీసులు అంతా అయిపోయిన తర్వాత తాపీగా వస్తారు. కానీ అలాంటి సీన్ నిజ జీవితంలో జరగవు అని నిరూపించారు సరూర్ నగర్ లేక్ పోలీసులు.

పాత సినిమాల్లో చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. హీరో కుటుంబసభ్యులు విలన్స్ చేతిలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటారు. ఐస్ గడ్డల మీద నిలబడి పైన ఉరితాళ్లు భిగించబడి ఉండడం, సల సల కాగే నీటి మీద బంధించి ఉంచడం లాంటి సీన్లు చాలా చూశాం. అయితే కష్టాల్లో ఉన్న వారిని రక్షించలంటూ పోలీసులకు ఫోన్ అందుతుంది. కానీ వాళ్లు వచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అంతకుముందే హీరో వచ్చి రౌడీలను చితకబాది తన కుటుంబసభ్యులను కాపాడతాడు. పోలీసులు అంతా అయిపోయిన తర్వాత తాపీగా వస్తారు.

 

కానీ అలాంటి సీన్ నిజ జీవితంలో జరగవు అని నిరూపించారు సరూర్ నగర్ లేక్ పోలీసులు. లేక్ పోలీసులు ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. వివరాలివి.

 

సరూర్ నగర్ లేక్ పోలీసులు సమయస్పూర్తిని చాటారు. ఒక నిండు ప్రాణం పోకుండా రక్షించారు. గొందిళ్ల శ్రీరాములు అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయన కొత్తపేటలో నివాసముంటున్నాడు.  సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో సరూర్ నగర్ చెరువులో దూకిండు. అదే సమయంలో కానిస్టేబుళ్లు ఎ.రాజు, జి.అశోక్ అక్కడ పెట్రోలింగ్ లో ఉన్నారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించి వారిద్దరూ చెరువులోకి దూకారు. వెంటనే శ్రీరాములను రక్షించారు. అనంతరం సరూర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

 

పోలీసు స్టేషన్ లోకి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తెలుసుకుని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ రాజు, అశోక్ చేసిన సాహసాన్ని గుర్తించి మిగతా పోలీసులు అభినందించారు.

click me!