అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి: మల్కాజిగిరి నుండి పోటీ?

By narsimha lodeFirst Published Feb 16, 2024, 11:22 AM IST
Highlights

సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి  శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

హైదరాబాద్:  సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి  శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిన్న  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి  తెలంగాణ అసెంబ్లీలో  సీఎం అనుముల రేవంత్ రెడ్డిని కలిశారు.  గతంలో  ఆయన భారత రాష్ట్ర సమితిలో ఉన్నారు.  గత ఎన్నికల్లో నాగార్జునసాగర్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయాలని ఆయన భావించారు. కానీ ఆయనకు  బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించలేదు.  తెలంగాణ రాష్ట్రంలో  మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చూస్తున్నారు. 

also read:ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి  పోటీ చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భావిస్తున్నారని  ప్రచారం సాగుతుంది. 2014 కంటే ముందు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి  మీడియాకు చెబుతున్నారు.  తాను విద్యాభ్యాసం చేసే సమయంలో కాంగ్రెస్ యూత్ విభాగంలో పనిచేసినట్టుగా  ఆయన గుర్తు చేసుకున్నారు.

also read:ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో పులి: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో

హైద్రాబాద్ లోని ప్రతి గల్లీ తనకు తెలుసునన్నారు.  తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తాను ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.
న్యూఢిల్లీలో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ తో  కూడ  ఆయన భేటీ అయ్యారు.

ఇబ్రహీంపట్టణం, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో  కూడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన కోసం  తన కుటుంబ సభ్యులు పనిచేస్తారన్నారు. తాను ఎన్నికల బరిలోకి దిగితే  తన అల్లుడు  అల్లు అర్జున్ కూడ  తన కోసం  పనిచేస్తారని ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
 

click me!