CAG Report: కాళేశ్వరంపై అసెంబ్లీలో కాగ్ నివేదిక.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

By Rajesh Karampoori  |  First Published Feb 16, 2024, 3:30 AM IST

CAG Report: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ లాగానే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు 2019 నవంబర్‌లో డిజైన్ లోపాల వల్లనే నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. 


CAG Report: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ లాగానే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కెఎల్‌ఐఎస్) అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు 2019 నవంబర్‌లో డిజైన్ లోపాల వల్లనే నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది.

నీటిపారుదల శాఖకు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఈ డిజైన్లను రూపొందించిందని కాగ్ పేర్కొంది.అప్పటి ప్రభుత్వం ,నీటిపారుదల శాఖ.. ఖర్చులు పెంచడం, నిధుల సేకరణ కోసం సమగ్ర ప్రణాళికలను దాటవేయడం, ఇతర నిబంధనలను ఉల్లంఘించిందనీకంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తెలిపింది.

Latest Videos

అసెంబ్లీలో కాగ్ నివేదికను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులో పలు సంచలన విషయాలను కాగ్ వెల్లడించింది. వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు (డిపిఆర్) ఖరారు కాకముందే ప్రాజెక్ట్ యొక్క అనేక భాగాలు ఆమోదించబడ్డాయనీ, కాంట్రాక్టర్లకు అప్పగించబడ్డాయని కాగ్ ఆడిట్ కనుగొంది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనాలు చేరలేదని, విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని తెలిపింది. రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం అయ్యాయనీ,  రీ ఇంజినీరింగ్ మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లింది. పనుల అప్పగింతలో నీటి పారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని నివేదిక వెల్లడించింది. 

కాళేశ్వరంలోని వివిధ అంశాలపై వివరణాత్మక అన్వేషణలు ప్రాజెక్ట్ రూపకల్పన, దాని అమలులో అనేక లోపాలున్నప్పటీకి అప్పటి BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన లేదా విస్మరించడానికి ఎంచుకున్న ఇంధన ఛార్జీలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. నివేదికలోని 218 పేజీలలో దాదాపు ప్రతి ఒక్కటి పేజీలో BRS ప్రభుత్వంపై నేరారోపణ చేసింది. 2022 వరకు ప్రాజెక్ట్ అమలును పరిగణనలోకి తీసుకున్న కాగ్ నివేదిక.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ. 81,911 కోట్లు కాగా, తుది అంచనా వ్యయం రూ. 1,47,427 కోట్లకు మించనుందని తెలిపింది.

ఈ ప్రాజెక్ట్ ఆర్థిక విపత్తు అని, దానిపై ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కేవలం 52 పైసలు మాత్రమే తిరిగి వస్తుందని కాగ్ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ తొలిఆర్థికంగా లాభదాయకం కాదని స్పష్టంగా సూచిస్తుంది.  ఈ స్థాయి ప్రాజెక్ట్ కోసం నిధుల మూలాల కోసం సమగ్ర ప్రణాళిక లేదని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందనిపేర్కొంది. 

click me!