తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు...

By SumaBala BukkaFirst Published Jan 22, 2022, 11:30 AM IST
Highlights

ఈ ఉత్తర్వుల ప్రకారం... జగిత్యాల అదనపు కలెక్టర్ గా జీఎస్ లత, నారాయణ్ పేట్ అదనపు కలెక్టర్ గా జి. పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్ గా ఖీమా నాయక్ కు పోస్టింగులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే వరంగల్ అదనపు కలెక్టర్ గా కె. శ్రీవాస్తవ, ములుగు అదనపు కలెక్టర్ గా వై.వి. గణేష్, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ గా ఎం. డేవిడ్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 

Telangana రాష్ట్రంలో వరుసగా ఐపీఎస్, ఐఏఎస్, అదనపు కలెక్టర్ హోదా, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడం, వెయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగులను ఇస్తోంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు additional collectorsను నియమిస్తూ Orderలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... జగిత్యాల అదనపు కలెక్టర్ గా జీఎస్ లత, నారాయణ్ పేట్ అదనపు కలెక్టర్ గా జి. పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్ గా ఖీమా నాయక్ కు పోస్టింగులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 

అలాగే వరంగల్ అదనపు కలెక్టర్ గా కె. శ్రీవాస్తవ, ములుగు అదనపు కలెక్టర్ గా వై.వి. గణేష్, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ గా ఎం. డేవిడ్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ గా ఉన్న పీ.శ్రీనివాస్ రెడ్డిని సిద్ధిపేటకు బదిలీ చేశారు. అంతేకాకుండా... బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్ ను కామారెడ్డి అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు. 

ఛంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్ కుమార్ తో పాటు హైదరాబాద్ జిల్లా భూ పరిరక్షణ ఎన్డీసీగా జీ. సంతోషినిలను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలువురు నాన్ కేడర్ అధికారులను కూడా బదిలీ చేశారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,243 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా .. కొత్తగా 4,416 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,26,819కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,069కి చేరింది. కోవిడ్ బారి నుంచి నిన్న 1,920 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 1670 కేసులు నమోదయ్యాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 25, భద్రాద్రి కొత్తగూడెం 88, జీహెచ్ఎంసీ 1670, జగిత్యాల 65, జనగామ 41, జయశంకర్ భూపాలపల్లి 36, గద్వాల 50, కామారెడ్డి 40, కరీంనగర్ 91, ఖమ్మం 117, మహబూబ్‌నగర్ 99, ఆసిఫాబాద్ 32, మహబూబాబాద్ 70, మంచిర్యాల 92, మెదక్ 52, మేడ్చల్ మల్కాజిగిరి 417, ములుగు 27, నాగర్ కర్నూల్ 72, నల్గగొండ 90, నారాయణపేట 36, నిర్మల్ 36, నిజామాబాద్ 75, పెద్దపల్లి 73, సిరిసిల్ల 44, రంగారెడ్డి 301, సిద్దిపేట 73, సంగారెడ్డి 99, సూర్యాపేట 59, వికారాబాద్ 63, వనపర్తి 46, వరంగల్ రూరల్ 70, హనుమకొండ 178, యాదాద్రి భువనగిరిలో 89 చొప్పున కేసులు నమోదయ్యాయి.

click me!