కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరనున్నారు మహేశ్వర్ రెడ్డి .
హైదరాబాద్; కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. గత కొంత కాలంగా మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాన్ని మహేశ్వర్ రెడ్డి ఖండించారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడుతున్నారని ఈ నెల 13న మహేశ్వర్ రెడ్డికి పీసీసీ షోకాజ్ నోటీసు పంపింది. ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ గా ఉన్న తనకు పీసీసీ ఎలా షోకాజ్ నోటీస్ పంపుతుందని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనకు షోకాజ్ నోటీసు పంపారన్నారు. ఈ షోకాజ్ నోటీస్ పై మల్లికార్జున ఖర్గే వద్దే తేల్చుకుంటానని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు
ఇవాళ ఉదయమే మహేశ్వర్ రెడ్డి హైద్రాబాద్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు.పీసీసీ నాయకత్వం తీరుపై మహేశ్వర్ రెడ్డి కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై మహేశ్వర్ రెడ్డి గతంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు ఏకమైన సమయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సీనియర్ల వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు పార్టీ అధిష్టానం అనుమతి లేదని బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు మహేశ్వర్ రెడ్డి.
also read:ఢిల్లీలోనే బండి , ఈటల మకాం: జూపల్లి సహా ముగ్గురు నేతల చేరికపై హైకమాండ్‌తో చర్చలు
గత నెలలో ఆదిలాబాద్ జిల్లా నుండి హైద్రాబాద్ కు పాదయాత్రను ప్రారంబించారు. పాదయాత్ర ప్రారంభించిన నాలుగ రోజులకే పాదయాత్రను నిలిపివేయాలని మాణిక్ రావు ఠాక్రే మహేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. మాణిక్ రావు ఠాక్రే ఈ ఆదేశాలు జారీ చేయడంపై మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతల తీరుపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీని వీడాలని మహేశ్వర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మహేశ్వర్ రెడ్డి రావడానికి ముందే తరుణ్ చుగ్ తో బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు.
కాంగ్రెస్ కు రాజీనామా లేఖతో తరుణ్ చుగ్ నివాసానికి
న్యూడిల్లీకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత తరుణ్ చుగ్ నివాసానికి చేరుకున్నారు. బీజేపీ నేత తరుణ్ చుగ్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తర్వాత బీజేపీ నేత తరుణ్ చుగ్ నివాసానికి వచ్చినట్టుగా మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా లేఖను మీడియాకు చూపారు.
నడ్డాతో భేటీ
తరుణ్ చుగ్ తో భేటీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ లతో కలిసి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు.