దేశంలోనే సెకండ్ ప్లేస్: నేడు వివాదాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్

By narsimha lodeFirst Published Jan 31, 2024, 2:10 PM IST
Highlights

దేశంలోనే మోడల్ పోలీస్ స్టేషన్ గా పేరొందిన  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్టేషన్ లో  పనిచేస్తున్న  వారిలో  86 మందిని బదిలీ చేయడం చర్చకు దారి తీసింది. 


హైద్రాబాద్: దేశంలోనే అత్యుత్తమైన పోలీస్ స్టేషన్ గా రికార్డు సృష్టించిన  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప్రస్తుతం  పలు ఆరోపణలకు  కేంద్రంగా మారింది. నిందితులను మార్చారనే  ఆరోపణలతో పంజాగుట్ట సీఐ  దుర్గారావును హైద్రాబాద్ సీపీ కొత్తకోట  శ్రీనివాస్ రెడ్డి  బదిలీ చేశారు.  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న  86 మంది  సిబ్బందిని  ఒకేసారి  బదిలీ చేస్తూ హైద్రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇన్స్ పెక్టర్ స్థాయి నుండి  హోంగార్డు వరకు  ఈ పోలీస్ స్టేషన్లో   పనిచేస్తున్న వారిని  బదిలీ చేశారు. 

2018 జనవరిలో  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు అవార్డు వచ్చింది. దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా   పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రికార్డుల్లోకెక్కింది.  నేరాల అదుపునకు, శాంతి భద్రతల పరిరక్షణకు,ట్రాఫిక్ నియంత్రణకు టెక్నాలజీ వినియోగంలో  పంజాగుట్ట పోలీస్ స్టేషన్  సిబ్బంది ముందున్నారు.  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను మోడల్ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దారు. అప్పట్లో  తెలంగాణ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి  ఈ పోలీస్ స్టేషన్ ను  మోడల్ స్టేషన్ గా తీర్చిదిద్దేందుకు గాను  అవసరమైన సాంకేతిక వనరులను ఈ స్టేషన్ లో కల్పించారు.

also read:కుమారీ ఆంటీ‌కి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: పాతస్థలంలోనే ఫుడ్ బిజినెస్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.  2018 ఏప్రిల్  19న కేరళ ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి చెందిన పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి  ఈ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు.  అప్పటి హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి,  అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిలు  టెక్నాలజీని ఎలా ఉపయోగించుకొని శాంతిభద్రతలను కాపాడుతున్న విషయాన్ని కేరళ సీఎం విజయన్ కు వివరించారు.

also read:పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఒకేసారి 86 మంది బదిలీ:హైద్రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలనం

అయితే కాలక్రమంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  పనిచేస్తున్న సిబ్బంది తీరుతో  అనేక ఆరోపణలు వచ్చాయి.  మద్యం తాగుతూ  వాహనాలు నడిపిన కేసులో అరెస్టైన  నిందితులు  ఇటీవలనే స్టేషన్ నుండి తప్పించుకున్నారు.   మరో వైపు గత ఏడాది డిసెంబర్  23న ప్రజా భవన్ బారికేడ్లను  కారు డీకొట్టింది.ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు రాహిల్ అలియాస్ సాహిల్  స్థానంలో మరొకరిని  మార్చారనే ఆరోపణలతో పంజాగుట్టు ఇన్స్ పెక్టర్ దుర్గారావును  బదిలీ చేశారు.ఇదే కేసులో  బోధన్ సీఐపై కూడ  చర్యలు తీసుకున్నారు. 
 

click me!