దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి.. బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ సవాలు..

Published : May 31, 2023, 11:09 AM IST
దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి.. బీజేపీకి అసదుద్దీన్ ఒవైసీ సవాలు..

సారాంశం

బీజేపీ నేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని సవాలు విసిరారు.

సంగారెడ్డి: బీజేపీ నేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని సవాలు విసిరారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ప్రకటనపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు తరచూ పాతబస్తీపై సర్జికల్‌స్ట్రయిక్‌ చేస్తామని అంటున్నారని.. వారికి దమ్ముంటే భారతదేశ భూభాగంలోకి చొచ్చుకువస్తున్న చైనాపై సర్జికల్‌ స్ట్రయిక్‌ చేయాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివ పేటలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అసదుద్దీన్ ఒవైసీ ఈ కామెంట్స్ చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ మైనార్టీలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. మైనార్టీ నాయకులను హత్య చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు మైనార్టీలను ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ముస్లింలపై ఆర్‌ఎస్‌ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శలు గుప్పించారు. 

Also Read: బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందే ఎంఐఎం.. బండి సంజయ్ సంచలనం..

అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్‌ల మధ్య రహస్య అవగాహన కుదిరిందనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలపై కూడా అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. ‘‘కారు స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకు (అమిత్ షా) ఎందుకు బాధ కలుగుతుంది?’’ అని  ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందని బీజేపీ అంటున్నదే నిజమైతే తెలంగాణాలోని దేవస్థానాలకు రూ. వేల కోట్లు ఎలా మంజూరు చేయిస్తానని ప్రశ్నించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్