క్యూనెట్ ఆస్తులను జప్తు చేయాలి: వీసీ సజ్జనార్

Published : May 31, 2023, 10:28 AM IST
క్యూనెట్  ఆస్తులను జప్తు  చేయాలి: వీసీ సజ్జనార్

సారాంశం

క్యూనెట్  సంస్థ  ఆస్తులను  జప్తు  చేయాలని  ఐపీఎస్ అధికారి  వీసీ సజ్జనార్  కోరారు.

హైదరాబాద్:  దేశంలో  క్యూనెట్ అరాచకాలు కొనసాగుతున్నాయని  ఐపీఎస్ అధికారి , తెలంగాణ ఆర్టీసీ ఎండీ  వీసీ సజ్జనార్  చెప్పారు.పెట్టుబడి పేరుతో క్యూనెట్ సంస్థ మోసాలకు  పాల్పడుతుందని  హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్  నిన్ననే  ప్రకటించారు.

also read:మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ ప్రతినిధులు అరెస్ట్: సీవీ ఆనంద్

 ఈ మేరకు  క్యూనెట్  సంస్థకు  చెందిన ముగ్గురిని నిన్న  అరెస్ట్  చేశారు హైద్రాబాద్ పోలీసులు. 

 

క్యూనెట్ సంస్థకు  చెందిన ముగ్గురిని  అరెస్ట్  చేసిన మరునాడే  ఈ విషయమై  వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా  స్పందించారు.మోసపూరిత  క్యూనెట్  వ్యవహరంపై  విచారణ  జరిపించాలని  ఆయన  కోరారు.  స్వప్నలోక్  ఘటనలో  ఆరుగురిని  పొట్టన పెట్టుకున్నారని  సజ్జనార్ ఆరోపించారు. మల్టీలెవల్  మార్కెటింగ్    సంస్థలపై  ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని  సజ్జనార్  కోరారు. క్యూనెట్  సంస్థల  ఆస్తులను  జప్తు  చేయాలని సజ్జనార్ డిమాండ్  చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్