నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో డెలీవరీ సమయంలో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు తలను కోసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో డెలీవరీ సమయంలో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు తలను కోసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు సదరు వైద్యులపై మెడికల్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.
Also Read:దిశ కేసు నిందితుల మృతదేహాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
డెలీవరి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు శిశువు తల కోసేయడంతో.. బిడ్డ మొండెం తల్లిగర్భంలోనే ఉండిపోయింది. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నివేదిక ఆధారంగా ఆధారంగా కుటుంబసభ్యుల నుంచి నిపుణుల బృందం వివరాలు సేకరించింది.
Also Read:అచ్చంపేట ఘటనపై విచారణ: పోలీసుల చెంతకు శిశువు తల
దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ తారాసింగ్ మాట్లాడుతూ.. సదరు గర్భిణీ కుటుంబసభ్యులు మృత శిశువుతోనే ఆసుపత్రికి వచ్చారని చెబుతున్నారు. కుళ్లిన దశ ఉండటంతో డెలివరీ చేసే సమయంలో తల ఊడి వచ్చిందని ఆయన తెలిపారు.
తల్లిని బతికించేందుకు హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లామని శిశువు తలను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆసుపత్రి దగ్గర పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు.