
హైదరాబాద్: Telangana కు చెందిన Congress పార్టీ సీనియర్లు సమావేశం నిర్వహించవద్దని అధిష్టానం సూచించింది. సమావేశం నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా పార్టీ నాయకత్వం హెచ్చరించింది.
ఆదివారం నాడు తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు Marri Shashidar Reddy, Jagga Reddy వి. హనుమంతరావు, Komatireddy Rajagopal Reddy తదితరులు సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. Revanth Reddy టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవహరిస్తున్న తీరుపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై కూడా నేతలు చర్చించారు. ఇప్పటికే ఈ విషయమై జగ్గారెడ్డి. వి. హనుమంతరావులు మీడియా వేదికగానే రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తున్నారు. అయితే తాజాగా మర్రి శశిధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు వారికి తోడు కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
గతంలో పొన్నాల లక్ష్మయ్య నివాసంలో సమావేశం జరిగింది. ఆ తర్వాత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సీనియర్లు చర్చించారు. ఇవాళ మూడో సమావేశం జరపాలని నిర్ణయం తీసుకొన్నారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై సోనియా, రాహుల్ గాంధీలకు నివేదిక ఇవ్వాలని కూడా సీనియర్లు భావిస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడాన్నే సీనియర్లు మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. అయితే పీసీసీ చీప్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం ఆయన అందరిని కలుపుకుపోవడం లేదనే అసంతృప్తిని అసంతృప్త నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకపోయిందని అసమ్మతి నేతలు భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఈ విషయమై పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో సీనియర్లు ఉన్నారు.
ఇవాళ సీనియర్లు సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయం తెలుసుకున్న ఎఐసీసీ కార్యదర్శి Bose Raju పార్టీ సినియర్లు మర్రి శశిధర్ రెడ్డి, వి.హనుమంతరావులకు ఫోన్ చేశారు. సమావేశం నిర్వహించవద్దని కోరారు. ఏదైనా ఇబ్బందులుంటే పార్టీ నాయకత్వానికి తెలపాలని సూచించారు. పార్టీకి ఇబ్బంది కల్గించేలా సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. అయితే ఈ సమావేశం నిర్వహిస్తారా, రద్దు చేస్తారా అనే విషయమై సీనియర్ల నుండి స్పష్టత రాలేదు.
జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ నేతల మధ్య అసమ్మతి చోటు చేసుకొంది. జీ 23 నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. జీ 23 కి మాజీ కేంద్ర మంత్రి Ghulam Nabi Azad నేతృత్వం వహిస్తున్నారు. రెండు రోజలు క్రితంత ఆజాద్ Sonia Gandhi తో సమావేశమయ్యారు. ఇటీవల వరుసగా తాము నిర్వహిస్తున్న సమావేశాలకు సంబంధించిన అంశాలపై సోనియాతో ఆజాద్ చర్చించారు
. పార్టీని క్షేత్రస్థాయి నుండి ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆజాద్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మరో వైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం పాలైనందున ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ అధ్యక్షులను రాజీనామా చేయాలని సోనియా గాంధీ కోరారు. దీంతో ఐదు రాష్ట్రాల PCC చీఫ్ లు తమ పదవులకు రాజీనామాలు చేశారు.