
ఆదిలాబాద్: ఏడు నెలల్లో మూడు సార్లు ఓStudentని Snake కరిచింది. రెండు సార్లు Snake bite నుండి ఆమె ప్రాణాపాయం నుండి తప్పించుకొంది. కానీ, మూడో సారి మాత్రం ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చదువులో చురుకుగా ఉండేదని స్నేహితులు చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బెదోడ గ్రామానికి చెందిన ప్రణాళి పాము కాటుతో మరణించింది. ఆమె Adilabad లోని ఓ ప్రైవేట్ కాలేజీలో Degree చదువుతుంది. Pranaali కి గతంలో రెండు సార్లు పాము కరిచింది. రెండు దఫాలు ఆమె కాటు నుంటి ప్రాణాలతో బయట పడింది. కానీ చివరికి ఈ నెల 18వ తేదీన ఆమెను పాము కరిచింది. Hospitalలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రణాళి తన నివాసంలో నిద్రిస్తున్న సమయంంలో పాము కాటుకు గురైంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేసి ఆమెను రక్షించుకొన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి మాసంలో మరో సారి ఆమె పాము కాటుకు గురైంది. ఇంటి ఆవరణలో కూర్చొన్న సమయంలో ఆమెను పాము కరిచింది. ఈ సమయంలో కూడా ఆమె చికిత్స నుండి కోలుకుంది. ఈ నెల 18వ తేదీన Holi ని పురస్కరించుకొని తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రణాళి ప్లాన్ చేసుకొంది. తన కాలేజీ బ్యాగులో రంగులను తెచ్చుకొంది. అయితే ఈ బ్యాగులో పాము ఉంది.ఈ విషయాన్ని గుర్తించిన ప్రణాళి బ్యాగులో రంగులను బయటకు తీస్తున్న సమయంలో పాము కాటు వేసింది. ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రణాళి మరణించింది.