బీజేపీ నేత నాయిని నరోత్తం రెడ్డిపై పోలీసు కేసు నమోదు.. రాజ్ న్యూస్ చానెల్ చెన్నై యాజమాన్యం ఫిర్యాదుతో కేసు..

Published : Oct 12, 2022, 11:11 AM IST
బీజేపీ నేత నాయిని నరోత్తం రెడ్డిపై పోలీసు కేసు నమోదు.. రాజ్ న్యూస్ చానెల్ చెన్నై యాజమాన్యం ఫిర్యాదుతో కేసు..

సారాంశం

బీజేపీ నేత నాయిని నరోత్తం రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మీడియా ముసుగులో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారనే ఆరోపిస్తూ ఫిర్యాదు రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బీజేపీ నేత నాయిని నరోత్తం రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మీడియా ముసుగులో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారనే ఆరోపిస్తూ ఫిర్యాదు రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. నరోత్తం రెడ్డి లీజు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రాజ్ టెలివిజన్ లిమిటెడ్ న్యూస్ చానెల్ చెన్నై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బందికి జీతాలు ఇవ్వ‌కుండా బిల్డింగ్ ను కబ్జా పెట్టార‌ని ఆరోపించారు. జీతాలు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొంది. నరోత్తం రెడ్డితో పాటు నవీన్ రెడ్డి, లింగారెడ్డిలపై ఫిర్యాదు చేసుకుంది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరోత్తం రెడ్డితో పాటు మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. 

రాజ్ టెలివిజన్ లిమిటెడ్ న్యూస్ చానెల్‌కు చెందిన జోసెఫ్ చెరియన్.. నరోత్తమ్ రెడ్డి, నవీన్ రెడ్డి, లింగా రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ టెలివిజన్ లిమిటెడ్‌ను సంహిత నెట్‌వర్క్ లిమిటెడ్ పరిమిత లైసెన్స్‌దారుగా చెల్లింపు ప్రాతిపదికన మాత్రమే బల్క్ ఎయిర్‌ టైమ్ వినియోగం కోసం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నరోత్తమ్ రెడ్డి, నవీన్ రెడ్డి, లింగారెడ్డి అనే వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఛానెల్‌ని దుర్వినియోగం చేస్తూ, తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ఈ ముగ్గురు చాలా కాలంగా ఉద్యోగులకు జీతాలు, విద్యుత్ వినియోగ ఛార్జీలు చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 10వ తేదీన రాత్రి 8.30 ఎలాంటి హక్కు లేకుండా జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నంబర్. 32లోని ఛానల్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి, రిసెప్షన్ పాయింట్ వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగారని చెప్పారు. అనంతరం  4వ అంతస్తుకు వచ్చి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌పై దాడి చేశారని ఆరోపించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి.. ఉద్యోగుల ముందు అతని ప్రతిష్టను దిగజార్చేలా అన్‌పార్లమెంటరీ భాషలో దుర్భాషలాడారని చెప్పారు. 

ఆ ముగ్గురి చేతిలో చేతిలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే.. దాని వల్ల వచ్చే అన్ని ఖర్చులు, పరిణామాలకు వారే బాధ్యత వహించాలని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!