ఈ నెల 18న ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.
హైదరాబాద్: ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ నెల 18వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తైన తర్వాత ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 18న మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది. ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది.
ఈ దిశగా ఆ పార్టీ వ్యూహ రచన చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఏ రకమైన వ్యూహంతో ఎన్నికలకు వెళ్లాలనే దానిపై రాహుల్ గాంధీతో మల్లికార్జున ఖర్గే చర్చించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీలను నియమించారు. తెలంగాణకు కేరళ ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
undefined
ఈ దఫా ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. తెలంగాణలో ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది. దీంతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఇతర పార్టీల బలబలాలపై చర్చించనున్నారు.
ఎన్నికల్లో ఏ రకంగా వెళ్తే ఫలితాలు దక్కుతాయనే విషయమై నేతలతో ఖర్గే చర్చించనున్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ వ్యూహం అనుసరించాలనే దానిపై కూడ ఖర్గే చర్చించనున్నారు.రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటుంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది.