Congress Coordinators 2024: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సంసిద్దమవుతోంది. ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనునడంతో సీరియస్ గా తీసుకున్న ఏఐసీసీ (AICC) దూకుడు పెంచింది. దేశంలోని పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించింది. పార్టీ సీనియర్ నేతలకు లోక్ సభ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ వారిని ఎంపీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లుగా నియమించింది.
Congress Co ordinators 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార పగ్గాలను చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరికొన్ని నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న ఏఐసీసీ ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది. పార్టీ సీనియర్ నేతలకు లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) బాధ్యతలు అప్పగిస్తూ వారిని ఎంపీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లుగా నియమించింది.
ఈ క్రమంలో తెలంగాణ 17 పార్లమెంట్ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు కోఆర్డినేటర్లుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలను నియమిస్తూ.. ఆ పార్లమెంట్ గెలుపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
undefined
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లు వీరే..
ఆంధ్రప్రదేశ్ లోని లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వీరే