భద్రాద్రి జిల్లాలో.. వృద్ధ దంపతులను చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

sivanagaprasad kodati |  
Published : Oct 09, 2018, 09:16 AM IST
భద్రాద్రి జిల్లాలో.. వృద్ధ దంపతులను చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

సారాంశం

భద్రాద్రి జిల్లాలో దారుణం జరిగింది.  చర్ల మండలం ఇద్దరు వృద్ధ దంతులు దారుణ హత్యకు గురయ్యారు. చర్ల బస్టాండ్ సమీపంలో నివసించే పున్నం చుక్కయ్య, యల్లమ్మలు చాకలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. 

భద్రాద్రి జిల్లాలో దారుణం జరిగింది.  చర్ల మండలం ఇద్దరు వృద్ధ దంతులు దారుణ హత్యకు గురయ్యారు. చర్ల బస్టాండ్ సమీపంలో నివసించే పున్నం చుక్కయ్య, యల్లమ్మలు చాకలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరికి ఐదుగురు కుమారులు.. వీరంతా కూడా అదే గ్రామంలో నివసిస్తున్నారు.

ఈ క్రమంలో తెల్లవారుజామున చుక్కయ్య ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధులపై కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ఈ దాడిలో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆరెంజ్ అలెర్ట్
నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet