ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చలి (Adilabad shivers) వణికిస్తుంది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి (temperature drops) చేరాయి. కుమురంభీం జిల్లాలోని సిర్పూర్(యు) లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చలి వణికిస్తుంది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి (temperature drops) చేరాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కుమురంభీం జిల్లాలోని సిర్పూర్(యు) లో 6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి టీలో 6.2 డిగ్రీలు, కుమురం భీం జిల్లాలోని గిన్నెదరిలో 6.4 డిగ్రీల.. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా.. జనాలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం పూట బయటకు రావాలంటే జనాలు వణికిపోతున్నారు (Adilabad shivers). చలి మంటల వేసుకుంటున్నారు. గతంలో కన్నా చలి తీవ్రత ఎక్కువగా ఉందని జనాలు అంటున్నారు. ఉదయం పూట పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. చలి తీవ్రతతో ఆలస్యంగా పనులకు వెళ్తున్నారని ఉమ్మడి జిల్లా ప్రజలు చెబుతున్నారు. షాపులకు ఆలస్యంగా తెరుస్తున్నట్టుగా యజమానులు తెలిపారు. బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పారు.
undefined
ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వృద్దులు, గర్బిణులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గబోతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరి ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని మారేడు మిల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.