పొరపాటున నోరు జారా .. క్షమించండి: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణలు

Siva Kodati |  
Published : Aug 06, 2022, 05:48 PM ISTUpdated : Aug 06, 2022, 05:50 PM IST
పొరపాటున నోరు జారా .. క్షమించండి: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణలు

సారాంశం

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు. పొరపాటున నోరా జారానని క్షమించాలని ఆయన కోరారు. వెంకటరెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఏమి అనలేదన్నారు. ఈ క్రమంలోనే వెంకటరెడ్డికి, ఆయన అభిమానులకు అద్దంకి దయాకర్ క్షమాపణలు తెలియజేశారు. 

కాగా... నిన్న మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఓ బూతు పదం వాడారు. ఈ వ్యాఖ్యలను సీనియర్లు ఖండిస్తున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ కార్యదర్శి బోసు ఏఐసీసీ కార్యదర్శికి ఫోన్ చేసి తెలియజేశారు. అద్దంకి దయాకర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ల ముందే అలా మాట్లాడితే.. ఎందుకు వారించలేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 

ALso REad:రేవంత్ సైన్యం దొంగల ముఠా.. పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో చేరతారు: రాజగోపాల్ రెడ్డి

మరోవైపు అద్దంకి దయాకర్ కామెంట్స్‌పై ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరిలో అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా అద్దంకి దయాకర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అద్దంకి దయాకర్‌ పార్టీకి ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసిన అద్దంకి దయాకర్‌కు బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పందిస్తూ.. అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్టుగా చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?