
సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో యువకుడి పై యాసిడ్ దాడి జరిగింది. స్థానిక విజయ డైరీలో పనిచేస్తున్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో దత్తు అనే యువకుడు మరో వ్యక్తి మీద యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన మిగతావారు ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.