ఆమె నా కొడుకుని ట్రాప్ చేసింది.. మోడల్ పై అత్యాచార ఘటనలో నిందితుడి తల్లి

Published : Jan 11, 2020, 01:40 PM ISTUpdated : Jan 11, 2020, 04:59 PM IST
ఆమె నా కొడుకుని ట్రాప్ చేసింది.. మోడల్ పై అత్యాచార ఘటనలో నిందితుడి తల్లి

సారాంశం

మగ పిల్లలను ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడితే... ఆడపిల్లలపై కేసులు, చట్టాలు ఉండవా? అని ఆమె ప్రశ్నించింది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని... తప్పంతా మోడల్‌దేనని వెల్లడించింది.


తనకు బలవంతంగా మద్యం తాగించి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాంటూ ఓ మోడల్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ ఘటనపై నిందితుడి తల్లి స్పందించింది. 

తన కొడుకును మోడల్ ట్రాప్ చేసిందని... తప్పుడు కేసు పెట్టి 20 లక్షలు డిమాండ్ చేసిందని తెలిపింది. పోలీసులు ఆడపిల్ల కదా అని కేసు పెట్టామంటున్నారని వాపోయింది. మగ పిల్లలను ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడితే... ఆడపిల్లలపై కేసులు, చట్టాలు ఉండవా? అని ఆమె ప్రశ్నించింది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని... తప్పంతా మోడల్‌దేనని వెల్లడించింది.

AlsoRead మోడల్ పై దారుణం: యువకుడు రేప్ చేస్తుంటే వీడియో తీసిన మిత్రుడు
 
తన కొడుకుతో ఆమె పెళ్లికి కూడా సిద్ధపడిందని... అయితే తన కుమారుడు మైనర్‌ అని.. వివాహం కుదరదు అని చెప్పానని తెలిపింది. రెండేళ్ల తర్వాత తన కొడుకు మేజర్ అవుతాడని... అప్పుడు మీ తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేస్తామని చెప్పినట్టు నిందితుడి తల్లి తెలిపింది. తన కొడుకు తప్పు చేశాడని... విచారణలో తేలితే... ఏ శిక్ష విధించినా అడ్డు చెప్పనని మీడియాకు తెలిపింది. తన కుమారుడిని మోడల్ ఎలా ట్రాప్ చేసిందో అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఏసీపీకి ఫిర్యాదు చేస్తామని... డబ్బు కోసం మోడల్ తల్లిదండ్రులు కూడా దిగజారారని... వాళ్లు కూడా రూ.10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమన్నారని నిందితుడి తల్లి తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ