నాగరాజును హత్య చేసేందుకు చాలా కాలంగా ఆశ్రిన్ సుల్తానా సోదరులు ప్లాన్ చేశారు.రంజాన్ ముగిసిన తర్వాత నాగరాజును హత్య చేశారు. నాగరాజు కదలికలు తెలుసుకొనేందుకు మొబైల్ లో సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేశారు.
హైదరాబాద్: Nagaraju పరువు హత్య కేసుకు సంబంధించి Remand Reportలో పోలీసులు కీలక విషయాలను ప్రకటించారు. నాగరాజును పథకం ప్రకారంగా హత్య చేసేందుకు Ashrin Sultana సోదరులు ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. తమ సోదరి ఆశ్రిన్ సుల్తానాను పెళ్లి చేసుకొన్నందుకు నాగరాజును హత్య చేయాలని ప్లాన్ చేశారు.నాగరాజు Mobile లో మాల్ వేర్ ను ఇన్‌స్టాల్ చేసి ఆయన కదలికలను మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేవారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.రంజాన్ మాసం రావడంతో నాగరాజు హత్య కొంత ఆలస్యమైందని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితులు Ramzan ఉపవాస దీక్షలో ఉన్నందున నాగరాజు హత్యను వాయిదా వేశారు. రంజాన్ పూర్తి కాగానే నాగరాజును నిందితులు హత్య చేశారు.
ఈ నెల 4వ తేదీన రాత్రి Saroornagar honour killing జరిగింది. సరూర్ నగర్ మున్సిపాలిటీ సమీపంలో నాగరాజును ఆశ్రిన్ సోదరులు హత్య చేశారు. ఈ ఏడాది జనవరి 31న ఆశ్రిన్ సుల్తానాను నాగరాజు వివాహం చేసుకొన్నాడు.ఈ వివాహం చేసుకోవడంతో నాగరాజుపై ఆశ్రిన్ సోదరులు కక్ష పెంచుకొని హత్య చేశారు. ఒకానొక దశలో నాగరాజు మతం మార్చుకోవడానికి కూడా సిద్దపడ్డాడు. ఆశ్రిన్ వివాహం చేసుకోవడానికి నాగరాజు ఈ నిర్ణయం తీసుకొన్నాడు. కానీ తమ సోదరులు అంగీకరించలేదని ఆశ్రిన్ ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
undefined
నాగరాజు,ఆశ్రిన్ లు వివాహం చేసుకొన్న తర్వాత పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆ సమయంలో ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నాగరాజు, ఆశ్రిన్ ఏం జరిగినా కూడా ఆశ్రిన్ కుటుంబానిదే బాధ్యత అని కూడా నాగరాజు ఆ సమయంలో పోలీసులకు తెలిపారు. అయితే ఆ సమయంలో మాత్రం ఏం మాట్లాడకుండా ఉన్నారని ఆశ్రిన్ చెబుతున్నారు.
నాగరాజు, ఆశ్రిన్ లు చిన్నప్పటి నుండి స్నేహితులు. చిన్నతనం నుండే వారి మధ్య ప్రేమ కొనసాగుతుంది. చివరికి వాళ్లు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొన్నారు. ఈ పెళ్లి జరిగిన తర్వాత రెండు కుటుంబాలకు కూడా ఇద్దరు దూరంగా ఉన్నారు. Hyderabad మలక్ పేటలోని కార్ల షోరూమ్ లో నాగరాజు సేల్స్ మెన్ గా పనిచేసేవాడు. తాము ఎక్కడ ఉన్నామనే సమాచారం తెలియకండా నాగరాజు, ఆశ్రిన్ లు జాగ్రత్తపడ్డారు. కానీ ఈ నెల 4వ తేదీన తమ బంధువుల ఇంటికి భార్యతో కలిసి నాగరాజు వెళ్తున్న సమయంలో ఆశ్రిన్ సోదరులు దాడి చేసి హత్య చేశారు.
మూడు రోజుల క్రితం ఆశ్రిన్ సుల్తానా సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తామని పోలీసులు ప్రకటించారు.ఈ హామీతోనే నాగరాజు అంత్యక్రియలను కటుంబ సభ్యులు నిర్వహించారు.నాగరాజు డెడ్ బాడీతోనే కుటుంబ సభ్యులు ఈ నెల 5వ తేదీన ఆందోళన నిర్వహించారు. ప్రజా సంఘాలు, దళిత సంంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. నాగరాజు కుటుంబంతో పాటు ఆశ్రిన్ సుల్తానాకు కూడా భద్రత కల్పిస్తామని కూడా పోలీసులు ప్రకటించారు.