ముందు ఆమేథీలో దృష్టి పెట్టాలి: రాహుల్ పై కేటీఆర్ సెటైర్లు

Published : May 08, 2022, 03:02 PM IST
  ముందు ఆమేథీలో దృష్టి పెట్టాలి: రాహుల్ పై కేటీఆర్ సెటైర్లు

సారాంశం

వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్:వచ్చే ఎన్నికల్లో మూడోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ధీమాను వ్యక్తం చేశారు.

ఆదివారం నాడు ASK KTR  అనే కార్యక్రమం  కింద ట్విట్టర్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తో పాటు ఇతర పార్టీలు తమకు పోటీ అని ఆయన చెప్పారు.కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రజల ఆస్తులను అమ్ముకుంటుందని ఆయన విమర్శించారు. కేంద్రంపై రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైద్రాబాద్ లో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహణ గురించి గంగూలీ, జైషాలను అడగాలని ఆయన కోరారు.

 

హైద్రాబాద్ కు ఐటీఐఆర్ ను NDA  ప్రభుత్వం ఇవ్వాలన్నారు తెలుగు మాదిరిగానే ఉర్ధూ కూడా భారత రాజ్యాంగం ద్వారా అధికారిక భాషగా గుర్తించిందని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు కూడా యూపీఎస్‌సీ తో సహా ఉర్దూలో కూడా రిక్రూట్ మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.  గ్రూప్ వన్ పరీక్షలను ఉర్దూలో నిర్వహించే విషయమై నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అంతేకాదు మతోన్మాదుల ప్రభావానికి గురికావొద్దని ఆయన కోరారు.

Hyderabad ను భారతీయ సినిమా హబ్ గా మార్చడానికి తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీకి ప్రపంచస్థాయి ఫిల్మ్ స్కూల్ యూనివర్శిటీ అవసరమని ఒక నెటిజన్ ప్రశ్నించారు.ఈ విషయమై సీఎం సార్ పనిచేస్తున్నారని కేటీఆర్ సమాధానమిచ్చారు.కరోనా కారణంగా ఈ ప్రణాళికలు ఆలస్యమయ్యాయన్నారు.ఆమేథీలో గెలుపుపై దృష్టి పెట్టాలని ఓ నెటిజన్ రాహుల్ గాంధీకి ఇచ్చే సలహా ఏమిటని ప్రశ్నిస్తే  కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

Petrol డీజీల్ ధరలు వంద రూపాయాలు దాటిన విషయమై ఓ నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఇండియాను పెట్రోల్, డీజీల్ ధరల్లో నెంబర్ వన్ స్థానంలో నిలుపుతాడని సెటైర్లు వేశారు.కేసీఆర్ కాకుండా తనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఇష్టమైన నేత అని కేటీఆర్ ప్రకటించారు. సుమారను 90 నిమిషాల పాటు పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu