గణేష్ నిమజ్జనంలో అపశృతి: ముగ్గురికి తీవ్ర గాయాలు

By Nagaraju TFirst Published 22, Sep 2018, 8:50 PM IST
Highlights

 కరీంనగర్‌జిల్లా జమ్మికుంటలో గణనాథుడి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. జమ్మికుంట, చుట్టుపక్క ప్రాంతాలకు సంబంధించి గణపతి విగ్రహాలను నాయిని చెరువులో నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. క్రేన్ సహాయంతో భారీ విగ్రహాలను సైతం నిమజ్జనం చేస్తున్నారు. 

కరీంనగర్‌: కరీంనగర్‌జిల్లా జమ్మికుంటలో గణనాథుడి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. జమ్మికుంట, చుట్టుపక్క ప్రాంతాలకు సంబంధించి గణపతి విగ్రహాలను నాయిని చెరువులో నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. క్రేన్ సహాయంతో భారీ విగ్రహాలను సైతం నిమజ్జనం చేస్తున్నారు. 

అయితే వినాయక విగ్రహాన్ని క్రేన్‌సాయంతో చెరువులో నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ తీగలు తెగిపోయాయి. దీంతో విగ్రహంతోపాటు ఉన్న నలుగురు వ్యక్తులు చెరువులో పడిపోయారు. అప్రమత్తమైన స్థానికులు, గజఈతగాళ్లు వారిని పైకి తీశారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

చెరువులో పడిన బాధితులు జమ్మికుంటకు చెందిన నిరంజన్ రెడ్డి, మహఏందర్, ప్రవీణ్, నరేష్ లుగా గుర్తించారు. వీరిలో ప్రవీణ్, నరేశ్ లు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే వీరి స్థానికులు వారిని పైకి తీశారు. బాధితులు జమ్మికుంటకు చెందిన నిరంజన్‌రెడ్డి, మహేందర్‌, మున్సిపల్‌ సిబ్బంది ప్రవీణ్‌, నరేష్‌లుగా గుర్తించారు.  

Last Updated 22, Sep 2018, 8:57 PM IST