గెలిచే స్థానాలను వదలొద్దు :టీ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచన

By Nagaraju TFirst Published 22, Sep 2018, 8:40 PM IST
Highlights

తెలంగాణలో గెలిచే స్థానాలను వదలొద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు. ఐక్యరాజ్యసమితిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు అమెరికా వెళ్లనున్న చంద్రబాబు నాయుడును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో టీడీపీ నేతలు కలిశారు. 

హైదరాబాద్: తెలంగాణలో గెలిచే స్థానాలను వదలొద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు. ఐక్యరాజ్యసమితిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు అమెరికా వెళ్లనున్న చంద్రబాబు నాయుడును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో టీడీపీ నేతలు కలిశారు. తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వరరావుతోపాటు పలువురు నేతలు చంద్రబాబును కలిశారు. 

మహాకూటమిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, టీడీపీ మేనిఫెస్టోపై చర్చించారు. అలాగే ఏయే స్థానాల్లో పోటీ చెయ్యాలి అన్న అంశాలపై చర్చించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు పర్యటన తేదీల ఖరారుపై కూడా చర్చించారు. అయితే తెలంగాణలో గెలిచే నియోజకవర్గాల్లో పోటీ చెయ్యాల్సిందేనని వాటిని వదులు కోవద్దని తెలిపారు. ఆశావాహులు పోటీ ఉన్నచోట అభ్యర్థులను నిలపాలని సూచించారు. అమెరికా పర్యటన అనంతరం లోతైన చర్చ చేద్దామని నేతలకు తెలిపారు చంద్రబాబు.  

Last Updated 22, Sep 2018, 8:40 PM IST