బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి : ప్రచార వాహనం పై నుంచి పడిపోయిన కేటీఆర్‌ .. కాస్తలో తప్పిపోయిందిగా

By Siva Kodati  |  First Published Nov 9, 2023, 2:56 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. నేతలు ప్రయాణిస్తున్న ప్రచార రథం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ విరిగింది. ఈ ఘటనలో పైన వున్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డిలు కిందపడ్డారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్ధి నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. నేతలు ప్రయాణిస్తున్న ప్రచార రథం డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ విరిగింది. ఈ ఘటనలో పైన వున్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డిలు కిందపడ్డారు. సురేష్ రెడ్డికి స్వల్పగాయాలు కాగా.. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను పట్టుకుని వెనక్కి లాగారు. 

 

Latest Videos

undefined

 

స్థానిక బీఆర్ఎస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్, జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి ఇతర నేతలు.. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పట్టణంలోని పాత ఆలూరు రోడ్డు జంక్షన్ వద్దకు రాగానే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో రెయిలింగ్ గ్రిల్ ఊడిపోవడంతో పైన వున్న నేతలు కిందపడ్డారు. అయితే ఎవ్వరికీ ఏం కాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరీ పీల్చుకున్నాయి. 

 

మంత్రి KTR కు తప్పిన పెను ప్రమాదం pic.twitter.com/0hoZfILWSV

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

దీనిపై ఎంపీ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగిందన్నారు. అందరం సురక్షితంగా బయటపడ్డామని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు, నేతలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రచారం యథావిధిగా జరుగుతుందని సురేష్ రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ సైతం కొడంగల్‌లో జరగనున్న బహిరంగ సభకు బయల్దేరినట్లుగా తెలుస్తోంది. 

click me!