బెయిల్ కోసం లంచం: ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, పరారీలో సీఐ

By Siva KodatiFirst Published Jan 9, 2020, 9:05 PM IST
Highlights

స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు అడ్మిన్ ఎస్‌ఐ సుధీర్ రెడ్డి.. వంశీని రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. గురువారం పక్కా ప్రణాళిక ప్రకారం సుధీర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధీర్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. వివరాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్‌కి చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి గతేడాది నవంబర్ 29న పేజ్ 3 సెలూన్‌కు వెళ్లి తన భార్యకు కేరాటిన్ ట్రీట్మెంట్ చేయాలని సెలూన్ యజమాని అక్షయను కోరారు.

Also Read:రూ.50 కోట్లపైగా అక్రమ ఆస్తులు: సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ అరెస్ట్

అందుకు అంగీకరించిన ఆమె ట్రీట్మెంట్ చేశారు. అయితే పని ముగిసిన తర్వాత వంశీ డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోయాడు. తన ఫీజు చెల్లించాలని అక్షయ పలుమార్లు వంశీకి ఫోన్ చేసింది. అయినప్పటికీ అతను స్పందించకపోవడంతో అక్షయ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు అడ్మిన్ ఎస్‌ఐ సుధీర్ రెడ్డి.. వంశీని రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. గురువారం పక్కా ప్రణాళిక ప్రకారం సుధీర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Also Read:Video : కనెక్షన్ కి లంచం అడిగాడు...అరెస్టు చేసి కరెంట్ షాకిచ్చారు...

2014 బ్యాచ్‌కు చెందిన సుధీర్ రెడ్డికి, గతేడాది జూబ్లీహిల్స్ పీఎస్‌లో అడ్మిన్ ఎస్సైగా పోస్టింగ్ వచ్చింది. ఈయనపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే సీఐ బలవంతయ్య ఆదేశాల మేరకే తాను లంచం డిమాండ్ చేశానని సుధీర్ ఏసీబీ అధికారులకు చెప్పాడు. విషయం బయటపడటంతో బలవంతయ్య పరారీలో ఉన్నారు. ఆయన కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

click me!