నకిలీ పత్రాలతో మ్యుటేషన్ : వెలుగు చూస్తున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లీలలు

By narsimha lodeFirst Published Oct 1, 2020, 2:51 PM IST
Highlights

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని నకిలీ పత్రాల ద్వారా భూములు మ్యూటేషన్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. 


హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని నకిలీ పత్రాల ద్వారా భూములు మ్యూటేషన్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ  కేసులో  తొమ్మిది మందిని ఏసీబీ నిందితులుగా చేర్చింది. ఈ నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

దయరా గ్రామంలో 48 ఎకరాల భూమికి నకిలీ పత్రాలతో మ్యూటేషన్ చేశారు.  ఈ కేసులో భూమి యజమాని ధర్మారెడ్డి, ఆయన కొడుకు శ్రీకాంత్ రె్డి, ఆపరేటర్ వెంకటేష్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్, జగదీశ్వర్ , భాస్కర్ రావు లను ఏసీబీ అరెస్ట్ చేసింది. 

కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు ఆరోపణలు: సెలవుపై మేడ్చల్ కలెక్టర్

మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన కేసులో నాగరాజు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

click me!