ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్నిన భర్తను చంపేసింది

Published : Oct 01, 2020, 10:35 AM IST
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్నిన భర్తను చంపేసింది

సారాంశం

ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్గుగా ఉన్నాడని భర్తను హత్యచేసింది భార్య. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకొంది. 


భూపాలపల్లి: ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్గుగా ఉన్నాడని భర్తను హత్యచేసింది భార్య. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకొంది. 

జిల్లాలోని మహాముత్తారం మండలం రేగులగూడెంలో ఆగష్టు 19వ  తేదీన  దేవేందర్ అనుమానాస్పదస్థితిలో మరణించాడు.ఈ విషయమై పోలీసులు చేసిన దర్యాప్తులో పోలీసులకు కీలక విషయం వెలుగు చూసింది. భార్య తన ప్రియుడితో కలిసి దేవేందర్ ను హత్య చేసినట్టుగా గుర్తించారు.

12 ఏళ్ల క్రితం దేవేందర్ కు మారుపాక స్వప్నకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఓ కూతురున్నారు. అయితే 2017 లో మహాముత్తారానికి చెందిన లింగమళ్ల కళ్యాణ్ తో స్వప్నకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర  సంబంధం ఏర్పడింది. 

ఈ విషయం దేవేందర్ కు తెలిసింది. భార్యను మందలించాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని సూచించాడు. కానీ భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు.

భర్తను అడ్డుతొలగించుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్వప్న భావించింది. భర్త అడ్డుతొలగించుకోవాలని ఆమె భావించింది.

పురుగుల మందును కళ్యాణ్ తన ప్రియురాలు స్వప్నకు అందించాడు. అయితే భర్తకు తెలియకుండా మద్యంలో ఈ విషపు గుళికలను ఆమె కలిపింది. విషం కలిపిన మద్యం తాగిన దేవేందర్ ఈ నెల 20వ తేదీన మరణించాడు. 

దేవేందర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. పోస్టు మార్టం రిపోర్టులో  దేవేందర్ పై విష ప్రయోగం జరిగినట్టుగా తేలింది. ఈ విషయమై స్వప్నను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

స్వప్నతో పాటు కళ్యాణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్