ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి డ్రైవర్ కి ఏసీబీ బెయిలబుల్ వారెంట్

Published : Jul 30, 2021, 08:01 AM IST
ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి డ్రైవర్ కి ఏసీబీ బెయిలబుల్ వారెంట్

సారాంశం

సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు  సమయంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.


ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డ్రైవర్, పీఏ పై ఏసీబీ( అవినీతి నిరోదక శాఖ) ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు  సమయంలో రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

సమన్లు తీసుకున్నప్పటికీ నిన్న విచారణకు గైర్హాజరు కావడంతో ఇద్దరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఏసీబీ కోర్టు... ఆగస్టు 9న హాజరుకావాలని స్పష్టం చేసింది. నిందితుల్లో ఉదయ్ సింహా నిన్న విచారణకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు  నేటికి వాయిదా వేసింది. 
 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?