కొత్తగా 623 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,43,716కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Jul 29, 2021, 10:19 PM IST
కొత్తగా 623 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,43,716కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 746 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 9,188 యాక్టివ్‌ కేసులు వున్నాయి.   

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 623 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 70, కరీంనగర్ జిల్లాలో 68, వరంగల్ అర్బన్ జిల్లాలో 67 కొత్త కేసులు వెలుగు చూశాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రంలో 746 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 6,43,716 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,30,732 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,796కి పెరిగింది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 17, జీహెచ్ఎంసీ 70, జగిత్యాల 27, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 1, కామారెడ్డి 3, కరీంనగర్ 68, ఖమ్మం 51, మహబూబ్‌నగర్ 6, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 16, మంచిర్యాల 16, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 29, ములుగు 7, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 38, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 7, పెద్దపల్లి 43, సిరిసిల్ల 18, రంగారెడ్డి 33, సిద్దిపేట 17, సంగారెడ్డి 5, సూర్యాపేట 21, వికారాబాద్ 5, వనపర్తి 3, వరంగల్ రూరల్ 13, వరంగల్ అర్బన్ 67, యాదాద్రి భువనగిరిలో 14 చొప్పున కేసులు నమోదయ్యాయి.  

 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్