కనిపించకుండా పోయిన వ్యక్తి.. కుళ్లిన స్థితిలో చెట్టునుంచి రాలి మృతదేహంగా లభ్యం...!

Published : Aug 27, 2021, 03:00 PM IST
కనిపించకుండా పోయిన వ్యక్తి.. కుళ్లిన స్థితిలో చెట్టునుంచి రాలి మృతదేహంగా లభ్యం...!

సారాంశం

మేడ్చల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ అతివేల్లికి చెందిన గడ్డం ప్రకాష్ ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు అతని భార్య ఈ నెల 6న మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్ : నేటిరోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. కుటుంబసమస్యలు, ఆర్థిక పరమైన కారణాలు, మానసికాందోళనలు, ఒత్తిడి.. ఇలా ఏ చిన్న సమస్య ఎదురైనా తట్టుకునే మానసికస్థైర్యాన్ని కోల్పోతున్నారు. దీంతో బలవంతంగా బతుకు చాలిస్తున్నారు. కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటన హైదరాబాద్ లో జరిగింది. 

మేడ్చల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ అతివేల్లికి చెందిన గడ్డం ప్రకాష్ ఈ నెల 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు అతని భార్య ఈ నెల 6న మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

కాగా, శుక్రవారం నాడు అతివేల్లిలోని ఓ సిమెంట్ తయారీ కంపెనీ సమీపంలోని చింతచెట్టు కింద కుళ్లిన స్థితిలో ఓ శవం కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేమానికి పంచనామా చేసి మార్చురీకి తరలించారు.

వారి దర్యాప్తులో ఆ శవం గడ్డం ప్రకాష్ దిగా గుర్తించారు. అతను ఉరివేసుకుని ఉంటాడని.. పది రోజులకు పైగా మృతదేహం కుళ్లి పోవడంతో చెట్ట మీదినుంచి కింద పడిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రకాశ్ మరణానికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు.
 
PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu