సెప్టెంబర్ 2న ఢిల్లీలో పార్టీ భవనానికి శంకుస్థాపన, సంస్థాగత కార్యక్రమాలు:కేటీఆర్

By narsimha lodeFirst Published Aug 27, 2021, 2:55 PM IST
Highlights


పార్టీ కోసం కష్టపడిన వారికే కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సెప్టెంబర్ 2 నుండి  పార్టీ సంస్థాగత ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. అదే రోజున ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి వివరించారు.
 

హైదరాబాద్:పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసిన వారికే కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. పార్టీ కమిటీల్లో కూడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 

also read:కుక్క కాటుకు చెప్పు దెబ్బ, రాజీనామా చేయి: రేవంత్‌పై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.సెప్టెంబర్ 2న జెండా పండుగను నిర్వహిస్తామన్నారు. అదే రోజున  ఢిల్లీలో టీఆర్ఎస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. 

సెప్టెంబర్ 2 నుండి  పార్టీ సంస్థాగత ప్రక్రియను ప్రారంభం కానుందని ఆయన వివరించారు. సెప్టెంబర్ 2 నుండి 12 లోపుగా పట్టణాల్లో వార్డు కమిటీలను పూర్తి చేయాలని ఆయన కోరారు.సెప్టెంబర్ 12 నుండి 20 వ తేదీ వరకు మండల, పట్టణ కార్యవర్గాల ఏర్పాటు  చేయనున్నట్టుగా  కేటీఆర్ తెలిపారు. 

సెప్టెంబర్ 20 తర్వాత కొత్త రాష్ట్ర కమిటీని ఎంపిక చేయనున్నట్టుగా  ఆయన చెప్పారు. హైద్రాబాద్‌లో బస్తీ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.  పార్టీ అనుబంధ విభాగాలను పటిష్టపరుస్తామన్నారు. అన్ని విభాగాలకు కూడా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. 

సోషల్ మీడియాకు కూడ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.సెప్టెంబర్ 2వ తేదీన జరిగే జెండా పండుగలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని  ఆయన కోరారు. హైద్రాబాద్లో ని భవనం కంటే ఢిల్లీలోని టీఆర్ఎస్ భవనం కూండ అద్బుతంగా నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు.
 

click me!