కుక్క కాటుకు చెప్పు దెబ్బ, రాజీనామా చేయి: రేవంత్‌పై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్

By narsimha lodeFirst Published Aug 27, 2021, 2:41 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రం సాధించడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ను ఇష్టారీతిలో మాట్లాడితే ఊరుకోమన్నారు. ఈ క్రమంలోనే అక్కడక్కడ తమ పార్టీ నేతలు నోరు జారి ఉండొచ్చన్నారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. 


హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు   కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంటివని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేసినట్టుగానే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

శుక్రవారం నాడు  ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ వ్యాఖ్యలకు మంత్రి మల్లారెడ్డి స్పందనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. రేవంత్ చిలుక మనదే, కానీ పలుకే పరాయిదని ఆయన చెప్పారు.  తెలంగాణ కాంగ్రెస్ చంద్రబాబు ప్రాంఛైజ్ అని ఆయన విమర్శించారు.

also read:మంత్రి మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి: వైరానికి కారణమిదీ..

also read:మల్లారెడ్డి.. దమ్ముంటే అవినీతిపై విచారణకు సిద్ధమవ్వు: దాసోజు శ్రవణ్

ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి మల్లారెడ్డి స్పందించారన్నారు.  మా మంత్రి మల్లారెడ్డికి జోష్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ అని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి సవాల్ కు ఆయన స్పందించారన్నారు. 

తెలంగాణ ఉద్యమ నాయకుడిగా  రాష్ట్రానికి  రెండోసారి సీఎంగా ఉన్న కేసీఆర్ ను పట్టుకొని కొందరు నేతలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను కూడా పలుసార్లు విమర్శలకు సహనం ఉంటుందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా మేం కూడా మాట్లాడొచ్చాన్నారు. కానీ తాము ఓపిక పడుతున్నామన్నారు మంత్రి కేటీఆర్. సహనానికి, ఒపికకూ హద్దులుంటాయని తాను గతంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. డబ్బుల సంచులతో  అడ్డంగా దొరికిన  నాయకులు కూడా వచ్చి నీతులు చెప్పడం హాస్యస్పదంగా ఉందని  ఆయన పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాజకీయాల్లో సంస్కారవంతంగా మాట్లాడాలన్నారు.

మహారాష్ట్రలో సీఎంను  తిడితే కేంద్ర మంత్రిని అరెస్ట్ చేశారని ఆయన గుర్తు చేశారు.  అదే పని తెలంగాణలో చేయాలా అని ఆయన ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. కొందరు జర్నలిస్టుల ముసుగులో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్ పిల్లలు చనిపోయారని  ఆవేశంతో మాట్లాడి ఉండొచ్చన్నారు. కానీ ఇప్పుడు విపక్షాలు ఎందుకు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టారో ప్రజలకు చెప్పాలన్నారు

click me!