అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు: నిహారికకు బెయిల్

By narsimha lode  |  First Published Mar 19, 2023, 10:32 AM IST

అబ్దుల్లాపూర్ మెట్  నవీన్  హత్య కేసులో   నిహారికకు బెయిల్ లభ్యమైంది.  ఈ నెల  6వ తేదీన  నిహారికను  పోలీసులు అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.  


హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్  నవీన్ హత్య కేసులో  హరిహరకృష్ణ  స్నేహితురాలు   నిహారికకు  బెయిల్  లభించింది.  ఈ నెల  6వ తేదీన  నిహారిక , హసన్ లను పోలీసులు అరెస్ట్  చేశారు.  

నవీన్ హత్య కేసు విషయం తెలిసి  కూడా  పోలీసులకు సమాచారం ఇవ్వలేదని  వీరిద్దరిని  పోలీసులు అరెస్ట్  చేశారు అంతేకాదు   నవీన్ హత్య  కేసులో  ఆధారాలను  ధ్వంసం  చేసేందుకు  నిందితుడు హరిహరకృష్ణకు  వీరిద్దరూ  నిందితులు  సహకరించారని  పోలీసులు  ఆరోపిస్తున్నారు.

Latest Videos

 నవీన్ ను హత్య చేసిన సంఘటన స్థలాన్ని  కూడా  వీరిద్దరూ  నిందితులు  చూశారు.  వారం  రోజుల పాటు  హరిహరకృష్ణను  కస్టడీలోకి తీసుకొని పోలీసులు కీలక  సమాచారాన్ని  సేకరించిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది ఫిబ్రవరి  17వ తేదీన  అబ్దుల్లాపూర్ మెట్  వద్ద  నవీన్ ను  హరిహరకృష్ణ హత్య చేశాడు. హత్య  చేసిన తర్వాత శరీర భాగాలను   వేరు చేశాడు.ఈ శరీర భాగాలను తన వెంట బ్యాగులో  తీసుకెళ్లాడు.  బ్రహ్మణపల్లికి  సమీపంలోని  నిర్మానుష్య ప్రాంతంలో  ఈ శరీర భాగాలను  వేశాడు.  పోలీసులకు లొంగిపోవడానికి  ముందుగా  ఈ శరీరభాగాలను  నవీన్ మృతదేహం వద్ద  హరిహరకృష్ణ, హసన్ లు కలిసి  దగ్దం  చేశారు. 

హరిహరకృష్ణ మాటలు  నమ్మినట్టుగా  నిహారిక  పోలీసులకు  ఇచ్చిన కన్ఫెన్షన్  స్టేట్ మెంట్ లో  పేర్కొంది.  నవీన్ హత్య  జరిగిన  తర్వాత  వీరిద్దరూ  నాలుగు దఫాలు  కలిశారు.  మూడుసార్లు  వనస్థలిపురంలో కలిశారు.  ఒక్కసారి  హస్తినాపురంలో  కలిసినట్టుగా  పోలీసులు గుర్తించారు.  

నవీన్  హత్య  జరిగిన  వారం రోజుల తర్వాత  హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోయారు.  వారం రోజుల పాటు  హరిహరకృష్ణ   వరంగల్,  నల్గొండ,  కోదాడ,  విశాఖపట్టణం, ఖమ్మం  ప్రాంతాలకు వెళ్లివచ్చినట్టుగా  పోలీసులు గుర్తించారు.  

also read:నవీన్ హత్య: శరీరభాగాలు దొరకకుండా హరిహరకృష్ణ ఏం చేశాడంటే?

నిహారిక  కోసం  నవీన్ ను హత్య చేసినట్టుగా  హరిహరకృష్ణ  తమ విచారణలో  ఒప్పుకున్నాడని గతంలోనే  పోలీసులు ప్రకటించారు.   నిహారిక, నవీన్,  హరిహరకృష్ణలు ఇంటర్  నుండి  స్నేహితులు.  
 

click me!