వరసకు కూతురైన యువతిని ప్రేమించిన యువకుడు.. నలుగురి సాయంతో దారుణంగా హత్య చేసిన తండ్రి

By Asianet News  |  First Published Sep 20, 2023, 9:41 AM IST

గత నెల 15వ తేదీన రంగారెడ్డి జిల్లాలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు.


కూతురు వరసయ్యే యువతిని ఓ యువకుడు ప్రేమించాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఈ విషయం ఆ యువతి తండ్రికి తెలిసి మందలించాడు. అయినా వినకపోవడంతో దారుణంగా అతడిని హతమార్చాడు. దీనికి మరో నలుగురి సాయం తీసుకున్నాడు. ఈ ఘటన గత నెల 15వ తేదీన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు ఓ మహిళకు ఫోన్ చేయడంతో సాంకేతికతను ఉపయోగించి పోలీసులు వారిని పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో అధికారులు మంగళవారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని నిర్ధవెళ్లిలో ఉన్న ఓ కోళ్ల ఫారంలో 18 ఏళ్ల కరణ్ కుమార్ కూలీ పనులు చేస్తుండేవాడు. ఆ యువకుడు బిహార్ కు చెందినవాడు కాగా.. ఇక్కడికి వలస వచ్చి జీవిస్తున్నాడు. అయితే అదే రాష్ట్రానికి చెందిన రంజిత్ కుమార్ తన కుటుంబతో కలిసి అదే గ్రామంలోకి వలస వచ్చాడు. కాగా.. కరణ్, రంజిత్ వరకు అన్నదమ్ములు అవుతారు.

Latest Videos

పని ఇప్పిస్తానని తీసుకెళ్లి వితంతువుపై 14 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. మత్తు మందు ఇచ్చి దారుణం..

కానీ అవేవీ పట్టించుకోకుండా కరణ్.. రంజిత్ కుమార్తెతో సన్నిహితంగా మెలిగాడు. ఆమెను ప్రేమించాడు. ఈ విషయం తండ్రికి తెలిసింది. ఇది సరైంది కాదని, ఆమె కూతురు వరస అవుతుందని చెప్పాడు. కానీ కరణ్ తీరు మార్చుకోలేదు. పైగా ఆ యువతిని వివిధ ప్రాంతాలకు తన వెంట తీసుకొని వెళ్లేవాడు. దీంతో రంజిత్ అతడిని హెచ్చరించాడు. ఈ పరిణామాల వల్ల కరణ్ ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. 

సిద్ధిపేటలో వేరే పనిలో చేరాడు. కానీ మళ్లీ అతడు తీరు మార్చుకోలేదు. రంజిత్ కూతురుతో పెళ్లి జరిగినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. దీంతో రంజిత్ విసిగిపోయాడు. అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సాయం చేయాలని ముంతోష్‌కుమార్‌, బబ్లూ తో పాటు మరో ఇద్దరు మైనర్ల కోరాడు. దీని కోసం ఓ ప్లాన్ వేశారు.

ప్రేమించడం లేదని యువతిపై కోపం.. దారుణ హత్య.. కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఘటన

అందులో భాగంగానే గత నెల 15వ తేదీన రంజిత్.. కరణ్ కు ఫోన్ చేసి.. పొలంలో పని ఉందని పిలిచాడు. అది నిజమే అనుకొని అతడు వచ్చాడు. దీంతో కరణ్ ను నిర్దవెల్లి-జూలపల్లి రోడ్డు పక్కకు తీసుకొని వెళ్లాడు. వారంతా కలిసి అతడిని బురద నీటిలో ముంచారు. ఊపిరి ఆడకపోవడంతో అతడు చనిపోయాడు. అనంతరం డెడ్ బాడీని అక్కడే పాతిపెట్టి, పారారయ్యారు. కాగా.. కరణ్ అన్న గత నెల 29వ తేదీన పోలీసులను ఆశ్రయించాడు. తన తమ్ముడు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరణ్ కు చివరి సారిగా రంజిత్ కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే బాధితుడి సిగ్నల్ నిర్ధవెల్లి ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు.. కరణ్ ను రంజిత్ హతమార్చాడని ఓ నిర్ధారణకు వచ్చారు. కానీ.. నిందితులు ఈ లోపే వేరే ప్రాంతాలకు పారిపోయారు. వారి ఫోన్లు కూడా స్విచ్ఛ్ ఆఫ్ వచ్చాయి. దీంతో వారి జాడ కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారింది.

తిరుమలలో బోనులో చిక్కిన ఆరో చిరుత.. లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే..

ఈ క్రమంలో ఒక నిందితుడు ఓ యువతికి కాల్ చేసి మాట్లాడాడు. అనంరతం ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేశాడు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి వెళ్లి వారిని అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తీసుకొని వెళ్లారు. 

click me!