జగిత్యాలలో విషాదం.. క్రికెట్‌ ఆడుతుండగా ఆగిన యువకుడి గుండె

By Asianet NewsFirst Published Mar 22, 2023, 7:35 AM IST
Highlights

జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండానే ఓ యువకుడు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో బాధితుడిని స్థానికులు హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆయన మరణించాడు. 

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు సంభవిస్తోంది. వివిధ పనుల్లో నిమగ్నమైన సమయంలో గుండెపోటు సంభవించడం వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు ఇటీవల వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలోనూ చోటు చేసుకుంది.

తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై బండి సంజయ్ సీరియస్

క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఓ యువకుడికి గుండెపోటు రావడంతో అతడు అక్కడే మరణించాడు. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. మల్లాపూర్ మండల కేంద్రంలో కొంత కాలంగా క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే ఇందులో గొర్రెపల్లి గ్రామ వాసి అయిన 30 ఏళ్ల కొంపల్లి విష్ణు కూడా ఆడుతున్నాడు.

రజనీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ.. పనిమనిషి, డ్రైవర్ అరెస్ట్..

ఎప్పటిలాగే మంగళవారం కూడా మల్లాపూర్ లో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆడేందుకు విష్ణు గ్రామం నుంచి బయలుదేరాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఒక్క సారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. క్రికెట్ ఆడేందుకు, చూసేందుకు వచ్చిన వారంతా వెంటనే అక్కడికి చేరుకున్నారు. విష్ణును చికిత్స కోసం మెట్ పల్లి హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆలోపే ఆయన చనిపోయారు. విష్ణుకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారని స్థానికులు తెలిపారు. అయితే ఆయన తల్లి గొర్రెపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా సేవలు అందిస్తున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం .. ముగిసిన కవిత ఈడీ విచారణ, సెల్‌ఫోన్‌లపైనే ప్రశ్నల వర్షం

ఖమ్మం జిల్లాలోనూ ఈ నెల 18వ తేదీన ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.  పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన మహిళ పేరు రాణి అని అధికారులు తెలిపారు. ఆమె అల్లిపురంలో జరిగిన వివాహానికి హాజరైంది. ఊరేగింపు సమయంలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. కానీ ఒక్కసారిగా ఆమె కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో అందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నిండుకుంది. రాణి మృతితో ఆమె కుటుంబసభ్యులు, బంధువుల శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘనతోపెళ్లి ఊరేగింపును అర్థాంతరంగా ఆపివేశారు. 
 

click me!