నారింజ పండ్ల వాహనం బోల్తా.. అందినకాడికి దోచుకెళ్లిన స్థానికులు.. కోతులు కూడా వచ్చి..

By Sairam Indur  |  First Published Jan 3, 2024, 5:55 PM IST

ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో నారింజ పండ్ల వ్యాన్ బోల్తా పడింది. అయితే స్థానికులు, వాహనదారులు ఆ పండ్లను సంచుల్లో ఎత్తుకెళ్లారు. తరువాత అక్కడికి కోతులు వచ్చి పండ్లను తిన్నాయి.


మనుషుల్లో మానవత్వం కరువయ్యింది. ప్రమాదం జరిగితే సాయం చేయాల్సింది పోయి, వారికి మరింత నష్టం కలిగించే పనులు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నారింజ పండ్లతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు అక్కడికి వచ్చి నారింజ పండ్లను దొరికిన కాడికి దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

కర్ణాటకలో గోద్రా తరహా ఘటన జరగొచ్చు - కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Latest Videos

undefined

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్ పూర్ నుంచి నారింజ పండ్ల లోడ్ తో ఓ వ్యాన్ హైదరాబాద్ కు బయలుదేరింది. ఆ వాహనం మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం కుప్టి గ్రామ సమీపంలోని చేరుకుంది. రాత్రి 11 గంటల సమయంలో మూల మలుపు వద్ద బోల్తా పడింది. దీంతో సుమారు 2 క్వింటాళ్ల నారింజ పండ్లు రోడ్డుపై పడిపోయాయి.

మహిళలను గర్భవతిని చేస్తే రూ.13 లక్షల పారితోషికం.. ఆఫర్ బాగుందని వెళ్తే ఇక అంతే సంగతి..

దీనిని చూసిన వాహనదారులు, స్థానికులు వాహనదారుడికి సాయం చేయాల్సింది పోయి.. అక్కడికి చేరుకొని దొరికిన కాడికి దోచుకున్నారు. సంచుల్లో పండ్లను నింపుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత సమయం తరువాత కోతులు కూడా అక్కడికి చేరుకొని పండ్లను ఆరగించడం మొదలుపెట్టాయి. అయితే వాహనం బోల్తా పడినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు.

Japan Plane Crash: రెండు విమానాలు ఢీ.. ఐదుగురు మృతి

కొంత సమయం తరువాత మిగిలిన, చెడిపోని పండ్లను వ్యాన్ లో ఎక్కించుకొని డ్రైవర్ నాగ్ పూర్ కు బయలుదేరాడు. అయితే నారింజ పండ్లను స్థానికులు ఎత్తుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

click me!