ఖమ్మంలో ఘోరం.. కూతురి మృతదేహాన్ని 68 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లిన గిరిజన దంపతులు

By team telugu  |  First Published Nov 8, 2022, 4:22 AM IST

కూతురు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో ఆ గిరిజన తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఓ యువకుడు బైక్ అందిచడంతో దానిపైనే దాదాపు 68 కిలో మీటర్లు మృతదేహాన్ని తీసుకొచ్చారు. 


ఖమ్మంలో అమానవీయ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్ లో చనిపోయిన కూతురు మృతదేహాన్ని తరలించేందుకు సిబ్బంది వాహనాన్ని ఇవ్వలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ గిరిజన దంపతులు శవాన్ని 68 కిలో మీటర్లు బైక్ పైనే తరలించారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత్ జోడో యాత్రను ఎవ్వరూ ఆపలేరు.. అది శ్రీనగర్‌లోనే ముగుస్తుంది - రాహుల్ గాంధీ

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లికి చెందిన వెట్టి మల్ల, ఆది దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక పేరు సుక్కి, కొంత కాలం నుంచి జ్వరంతో బాధపడుతోంది. అయితే ఆమెకు ఫిట్స్ రావడంతో ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే కేంద్రానికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు సోమవారం ఉదయం ఆమెను ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు.

మునుగోడులో ఓటమిపై బీజేపీ పోస్టుమార్టం: కేంద్ర నాయకత్వానికి నివేదికను పంపనున్ననేతలు

అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో బాలిక చనిపోయింది. దీంతో ఆ బాలిక మృతదేహాన్ని ఇంటికి తరలించడానికి తండ్రి వెట్ట మల్ల హాస్పిటల్ సిబ్బందిని వేడుకున్నాడు. ఒక అంబులెన్స్ ఇప్పించాలని ప్రదేయపడ్డాడు. కానీ సిబ్బంది కనికరం చూపలేదని తండ్రి ఆరోపించినట్టు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది. 

గద్వాల న్యూడ్ వీడియో కాల్స్ కేసు: ఎస్ఐ హరిప్రసాద్ పై బదిలీ వేటు 

దీంతో మల్ల వద్ద ఉన్న రూ.100తో స్వగ్రామానికి వెళ్లాడు. కూతురు మృతదేహాన్ని తీసుకురావడానికి సాయం చేయాలని గ్రామస్తులను వేడుకున్నాడు. దీంతో ఓ యువకుడు బైక్ ను అందించాడు. దానిపై బిడ్డ మృతదేహాన్ని ఆ తల్లిదండ్రులు  దాదాపు 68 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తరలించారు. 

click me!