బిఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మార్చండి..: కేటీఆర్ తో కడియం ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Jan 11, 2024, 7:43 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఓ కారణం అయ్యిందని బిఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారట. దీంతోో బిఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ మొదలయ్యింది. 


హైదరాబాద్ : తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన పార్టీ టిఆర్ఎస్. ఉద్యమపార్టీగా ప్రారంభమైన టిఆర్ఎస్ ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది ... పదేళ్లపాటు తెలంగాణను పాలించింది. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పార్టీ కాస్త జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ నిర్ణయం తెలంగాణ సెంటిమెంట్ ను పార్టీకి దూరం చేసిందని ... ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిందని బిఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బిఆర్ఎస్ పేరును తిరిగి టిఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ మొదలయ్యింది. 

నిన్న(బుధవారం)  వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు వ్యక్తపర్చారు. తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ను తమ సొంత పార్టీగా భావించారని ... అయితే పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగించడంతో ప్రజల సెంటిమెంట్ పై ప్రభావం చూపిందని కడియం అన్నారు. టిఆర్ఎస్ తో ప్రజలు అటాచ్ మెంట్ వుండేది... బిఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్, అటాచ్ మెంట్ లేకుండా పోయాయన్నారు. కాబట్టి ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని దృష్టిలో వుంచుకుని బిఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మార్చే విషయం గురించి పునరాలోచించాలని కేటీఆర్ ను కడియం కోరారు. 

Latest Videos

పార్టీ పేరులో తెలంగాణను తొలగించడం గత ఎన్నికల్లో దెబ్బతీసిందని ... దీనివల్లే కనీసం 1-2 శాతం ఓట్లు దూరమయ్యాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని కడియం పేర్కొన్నారు. పార్టీకి కలిసివచ్చిన తెలంగాణ సెంటిమెంట్ ను దూరం చేసుకోవడం మంచిది కాదని...  బిఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ మార్చాలని పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. 

Also Read  జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

జాతీయ రాజకీయాల్లో బిఆర్ఎస్ ను అలాగే వుంచి తెలంగాణలో మాత్రం టిఆర్ఎస్ ను కొనసాగించాలని కడియం సూచించారు. ఈ విషయంలో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే పార్టీ పెద్దలు వినోద్ కుమార్ వంటివారు చూసుకోవాలని కోరారు. పార్టీ పేరులో తిరిగి టిఆర్ఎస్ చేర్చే అంశంపై అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కడియం శ్రీహరి పార్టీ పెద్దలను కోరారు. 

 

click me!